Ayushman Bharat : ఇంట్లోనే మీ ఫోన్ ద్వారా ఆయుష్మాన్ భార‌త్‌కు ఇలా అప్లై చేసుకోవ‌చ్చు..!

November 9, 2023 5:38 PM

Ayushman Bharat : భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీము వలన చాలా ప్రయోజనం ఉంటుంది. దేశంలోని నిరుపేద పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడానికి, ఈ స్కీము ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. అర్హులైన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స ని అందించడం, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, BPL రేషన్ కార్డ్ హోల్డర్లు అలానే రాష్ట్రీయ భీమా పథకం కింద నమోదు చేసుకున్న వాళ్ళు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ప్రతి కుటుంబానికి, సంవత్సరానికి రూ. 5,00,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. రిజిస్టర్డ్ హెల్త్‌కేర్ సౌకర్యాలలో ఉచిత చికిత్సను కూడా పొందవచ్చు. APL కార్డ్‌లు లేదా నాన్-బిపిఎల్ కార్డ్‌లను ఉంటే, చికిత్స ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వ ప్యాకేజీ రేట్లలో కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కో కుటుంబానికి వార్షిక పరిమితి రూ. 1,50,000.

how to apply for Ayushman Bharat in telugu
Ayushman Bharat

భూమిలేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రోజువారీ కూలీలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులకు ఈ స్కీము తాలూకా లాభాలు ఉంటాయి. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు ని ఈజీగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈజీగా దరఖాస్తు చేయచ్చు. http://beneficiary.nha.gov.inకి లాగిన్ చేసి, అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్‌ను చూడండి. బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి, నంబర్‌ను ఇవ్వండి. ఓటీపీ వస్తుంది. రేషన్ కార్డ్ విభాగం కోసం చూడండి. మీ కుటుంబం పేరును కనుగొని, కార్డ్ ఉద్దేశించిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేయాలి.

మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని ప్రాంప్ట్ చేయబడ్డాక ఓటీపీ వస్తుంది. ఆ తరవాత, సమ్మతి పత్రం వస్తుంది. అవి చూసాక, అనుమతించు అనే బటన్‌ను క్లిక్ చేయండి. “E-KYC ఆధార్ OTP” ని సెలెక్ట్ చేయండి. ఆధార్ ధృవీకరణ తర్వాత, క్యాప్చా ఇవ్వండి. మీ మొబైల్ కెమెరాను ఉపయోగించి ఫోటో తీయండి. ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now