బైక్ కొనాలనుకునే వారికి శుభవార్త.. ఏకంగా రూ.17 వేల తగ్గింపు ధరలతో..

July 7, 2021 5:04 PM

మీరు కొత్తగా బైక్ కొనాలని భావిస్తున్నారా? అయితే బజాజ్ వారు మీకు అద్భుతమైన ఆఫర్ ని ప్రకటిస్తున్నారు. బజాజ్ ఆటో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే బజాజ్ డామినర్ 250 బైక్ ధరను భారీగా తగ్గించింది. రూ.16,800 కోత విధించింది. దీంతో డామినర్ 250 ధర రూ.1.54 లక్షలకే పొందవచ్చు.

ఈ విధంగా బజాజ్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించడంతో బజాజ్ డామినర్ బండ్లకు భారీగా డిమాండ్ పెరగనుందని చెప్పవచ్చు. భారీ తగ్గింపు ధరలతో అద్భుతమైన ఫీచర్లతో డామినర్ 250 ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.డామినర్ 400 లో ఏ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయో..డామినర్ 250 లో కూడా అదే ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో కేవలం ఇంజన్ కెపాసిటీ మాత్రమే మారుతుంది.

ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ స్కూటర్ లు, బైక్ ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో బజాజ్ డామినర్ 250 ధరలు కూడా తగ్గాయి.అయితే బండి కొనాలనుకునే వారికి ఇది మాత్రం ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ప్రస్తుతం డామినర్ 250 బైక్ రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment