కరోనా వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గతేడాది ఆలస్యంగా జరిగింది. అయితే ఈసారి మాత్రం అనుకున్న తేదీలకే మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. ఇంకొన్ని గంటల్లోనే ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం కానుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను హాట్ స్టార్ తన యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుందనే సంగతి తెలిసిందే. కానీ ఆ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. అయితే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. అదెలాగంటే…
జియో, ఎయిర్‌టెల్, వి, జియో ఫైబర్, జియో పోస్ట్ పెయిడ్ ప్లస్, టాటా స్కై, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగానే వీక్షించవచ్చు. అందుకు గాను వారికి ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దాన్ని పొందేందుకు వారు ఆయా కంపెనీలు నిర్దేశించిన విధంగా ప్లాన్‌లను రీచార్జి చేసుకోవాలి. పోస్ట్‌పెయిడ్ అయితే అధిక విలువ కలిగిన ప్లాన్‌ను తీసుకోవాలి. దీంతో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
హాట్‌స్టార్‌లో రెండు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీఐపీ ప్లాన్ అయితే రూ.399కు లభిస్తుంది. కానీ ఆయా టెలికాం సంస్థలకు చెందిన పలు ప్రీపెయిడ్ ప్లాన్లతో హాట్‌స్టార్ వీఐపీ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఇక పోస్ట్‌పెయిడ్ అయితే ఎంపిక చేసిన ప్లాన్లతో హాట్ స్టార్ వీఐపీ ప్లాన్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమకు ఆ అకౌంట్‌లో ఉన్న సూపర్ కాయిన్లను ఉపయోగించి హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ను కొనుగోలు చేయవచ్చు. దీంతో హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…