టెలికాం సంస్థ రిలయన్స్ జియో అత్యంత చవక ధరకే జియో ఫోన్ నెక్ట్స్ పేరిట గూగుల్‌తో కలిసి ఓ స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఆ ఫోన్‌ను వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నామని కూడా జియో గత నెలలో ప్రకటించింది. అయితే జియో ఫోన్ నెక్ట్స్ విడుదల ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని జియో తెలియజేసింది.
జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌లో ఉపయోగించే చిప్‌లకు గాను కొరత ఏర్పడిందని, అందువల్ల ఫోన్ లాంచింగ్ ను వాయిదా వేస్తున్నామని జియో ప్రకటించింది. వాస్తవానికి వినాయక చవితి రోజు ఈ ఫోన్‌ను లాంచ్ చేయాల్సి ఉందని, కానీ దీపావళి రోజు ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తామని తెలిపింది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ రావాలంటే దీపావళి వరకు వేచి చూడక తప్పదు.
ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించడంతోపాటు రెండు మోడల్స్ లో ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. రూ.500, రూ.700 చెల్లించి ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. వాటి ధర రూ.5వేలు, రూ.7వేలుగా ఉంటాయని సమాచారం. ఈ క్రమంలోనే మిగిలిన మొత్తాన్ని సులభమైన నెలసరి వాయిదా పద్థతుల్లో చెల్లించే అవకాశాన్ని జియో కల్పిస్తుందని తెలుస్తోంది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ కోసం దీపావళి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…