జియో అత్యంత చ‌వ‌క ఫోన్‌.. జియో ఫోన్ నెక్ట్స్‌.. విడుద‌ల వాయిదా.. లాంచింగ్ అప్పుడే..!

September 10, 2021 2:32 PM

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో అత్యంత చ‌వ‌క ధ‌ర‌కే జియో ఫోన్ నెక్ట్స్ పేరిట గూగుల్‌తో క‌లిసి ఓ స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్న విష‌యం విదిత‌మే. ఆ ఫోన్‌ను వినాయ‌క చ‌వితి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నామ‌ని కూడా జియో గ‌త నెల‌లో ప్ర‌క‌టించింది. అయితే జియో ఫోన్ నెక్ట్స్ విడుద‌ల ఆల‌స్యం కానుంది. ఈ విష‌యాన్ని జియో తెలియ‌జేసింది.

జియో అత్యంత చ‌వ‌క ఫోన్‌.. జియో ఫోన్ నెక్ట్స్‌.. విడుద‌ల వాయిదా.. లాంచింగ్ అప్పుడే..!

జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌లో ఉప‌యోగించే చిప్‌ల‌కు గాను కొర‌త ఏర్ప‌డింద‌ని, అందువ‌ల్ల ఫోన్‌ లాంచింగ్ ను వాయిదా వేస్తున్నామ‌ని జియో ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి వినాయ‌క చ‌వితి రోజు ఈ ఫోన్‌ను లాంచ్ చేయాల్సి ఉంద‌ని, కానీ దీపావ‌ళి రోజు ఈ ఫోన్‌ను ఆవిష్క‌రిస్తామ‌ని తెలిపింది. అందువ‌ల్ల జియో ఫోన్ నెక్ట్స్ రావాలంటే దీపావ‌ళి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

జియో అత్యంత చ‌వ‌క ఫోన్‌.. జియో ఫోన్ నెక్ట్స్‌.. విడుద‌ల వాయిదా.. లాంచింగ్ అప్పుడే..!

ఈ ఫోన్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందించ‌డంతోపాటు రెండు మోడ‌ల్స్ లో ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. రూ.500, రూ.700 చెల్లించి ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. వాటి ధ‌ర రూ.5వేలు, రూ.7వేలుగా ఉంటాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే మిగిలిన మొత్తాన్ని సుల‌భ‌మైన నెల‌స‌రి వాయిదా ప‌ద్థ‌తుల్లో చెల్లించే అవ‌కాశాన్ని జియో క‌ల్పిస్తుంద‌ని తెలుస్తోంది. అందువ‌ల్ల జియో ఫోన్ నెక్ట్స్ కోసం దీపావ‌ళి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now