Sim Cards : దేశంలోని మొబైల్ ఫోన్ వినియోగదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో చాలా మంది 9 సిమ్ కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో కార్డులను వాడుతున్నారని గుర్తించింది. దీంతో అలాంటి సిమ్‌లన్నీ ఇకపై పనిచేయకుండా పోనున్నాయి. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో ఇకపై 9 కన్నా ఎక్కువ సంఖ్యలో సిమ్‌కార్డులను వాడడం కుదరదు. అదే జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంలలో అయితే 6 కన్నా ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడరాదు. ఒక వేళ వాడదలిస్తే డిసెంబర్ 7న టెలికాం శాఖ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 60 రోజుల్లోగా పౌరులు తాము వాడుతున్న సిమ్ కార్డులను రీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆలోగా రీ వెరిఫికేషన్ చేయించుకోకపోతే అలాంటి సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేయనున్నారు. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆ శాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
దేశంలో చాలా మంది లెక్కకు మించి సిమ్ కార్డులను వాడుతున్నారని టెలికాం శాఖ తెలియజేసింది. అయితే కొందరు అలాంటి సిమ్‌లతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
అయితే అంగ వైకల్యం ఉన్నవారికి, హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న వారికి, విదేశాల్లో ఉన్నవారికి 60 రోజులు కాకుండా అదనంగా మరో 30 రోజుల సమయం ఇస్తున్నట్లు టెలికాం శాఖ తెలియజేసింది. కనుక 9 కన్నా ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్నవారు వెంటనే రీ వెరిఫికేషన్ చేయించుకోండి. లేదంటే ఆ కార్డులు డీయాక్టివేట్ అయిపోతాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…