BSNL Signal : మీ ఏరియాలో BSNL సిగ్న‌ల్ ఎలా ఉందో చెక్ చేయాలా..? ఇది పాటించండి..!

January 15, 2026 9:13 PM

BSNL Signal : టెలికాం కంపెనీలు మొబైల్ రీచార్జి ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచిన విష‌యం తెలిసిందే. ఎయిర్‌టెల్‌, జియో, వీఐ కంపెనీలు రీచార్జి ధ‌ర‌ల‌ను ఇటీవ‌ల పెంచేశాయి. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఆయా నెట్‌వ‌ర్క్‌ల‌లో ఉండ‌లేక చాలా మంది ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే బీఎస్ఎన్ఎల్‌కు గాను దేశంలో ఇంకా 4జి రాలేదు. 3జి సేవ‌లే కొన‌సాగుతున్నాయి. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు దేశ‌మంత‌టా బీఎస్ఎన్ఎల్ 4జి సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పింది.

అయితే ఇత‌ర కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ రీచార్జి ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చాలా మంది ఆ నెట్‌వ‌ర్క్‌కు మారుతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్‌కు వాస్త‌వానికి 4జి ట‌వ‌ర్లు ఎక్కువ‌గా లేవు. క‌నుక మీరు కూడా బీఎస్ఎన్ఎల్‌కు మారిపోవాల‌ని చూస్తుంటే ముందుగా మీరు మీ ప్రాంతంలో 4జి ట‌వ‌ర్ ఉందా.. లేదా.. అన్న‌ది తెలుసుకోవాలి. దీంతో మీరు బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోయినా నెట్‌వ‌ర్క్ ప‌రంగా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే బీఎస్ఎన్ఎల్ నెట్‌వ‌ర్క్ సిగ్న‌ల్ మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకోవాలంటే అందుకు కింద చెప్పిన ఓ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

how to check BSNL Signal in your area
BSNL Signal

ముందుగా మీరు మీ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌లోకి వెళ్లి అక్క‌డ https://tarangsanchar.gov.in/emfportal అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో కింద‌కు వెళ్లి అక్క‌డ ఉండే my position అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అనంత‌రం తెర‌పై మీ పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్‌, కాప్చాను ఎంట‌ర్ చేయాలి. త‌రువాత ఓటీపీని ఎంట‌ర్ చేసి మెయిల్‌కి పంపుపై క్లిక్ చేయాలి. అనంత‌రం ఓటీపీని ఎంట‌ర్ ఏయాలి. అప్పుడు వ‌చ్చే తెర‌పై మీకు మీ స‌మీపంలోని అన్ని సెల్‌ఫోన్‌ల ట‌వ‌ర్ల మ్యాప్ క‌నిపిస్తుంది. అందులో సిగ్న‌ల్ 2G/3G/4G లేదా 5Gని మీరు చూడ‌వ‌చ్చు. మీకు ఆప‌రేట‌ర్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దాన్ని బ‌ట్టి మీ ఏరియాలో BSNL సిగ్న‌ల్ ఎలా ఉందో చెక్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now