మొబైల్స్ తయారీదారు వివో.. వై సిరీస్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వివో వై21 పేరిట ఆ ఫోన్ విడుదలైంది. ఇందులో 6.51 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ హీలియో పి35 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. అవసరం అయితే ర్యామ్‌ను ఇంకో 1జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 2 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు కూడా వెనుక ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కన ఉంది. దీంతో ఫోన్‌ను కేవలం 0.22 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేయవచ్చు.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను, మెమొరీ కార్డును వేసుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
వివో వై21 ఫోన్‌కు చెందిన 64జీబీ మోడల్ ధర రూ.13,990 ఉండగా, 128జీబీ మోడల్ ధర రూ.15,490గా ఉంది. ఈ ఫోన్‌ను వివో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్ వంటి సైట్లు, అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…