మొబైల్స్ తయారీదారు వివో.. వి21 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 44 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. నైట్ పోర్ట్రెయిట్, సూపర్ నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లను ఈ కెమెరాకు అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 63 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది.
వివో వి21 5జి స్మార్ట్ ఫోన్ ఆర్కిటిక్ వైట్, సన్‌సెట్ డాజిల్, డస్క్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,990 ఉండగా, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,990గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మే 6వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…