శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం32 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో డిస్‌ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు వేసి పెంచుకోవచ్చు. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సి తదితర ఇతర ఫీచర్లు ఇందులో లభిస్తుంది.
ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేసినందున బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అలాగే వేగంగా చార్జింగ్ కూడా అవుతుంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. జూన్ 28వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లలో లభిస్తుంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రూ.1250 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…