మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. నార్జో 30 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్ లభిస్తుంది.
ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ పోర్ట్రెయిట్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్స్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
30 వాట్ల డార్ట్ చార్జ్ ఫీచర్ ఉన్నందున 25 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం చార్జింగ్ అవుతుంది. 65 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లు వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి తదితర ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూన్ 29 నుంచి కొనుగోలు చేయవచ్చు. మొదటి సేల్‌లో రూ.500 తగ్గింపు లభిస్తుంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…