సాధారణంగా బిడ్డ పుట్టగానే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తారు.ఆరు నెలల తర్వాత బిడ్డ అన్నం కోసం ఎదురు చూస్తోందని తనకు అన్నప్రాసన కార్యక్రమం చేసి అన్నం తినిపించడం చేస్తుంటారు. అయితే అన్నప్రాసన అబ్బాయిలకు ఎప్పుడు చేయాలి? అమ్మాయిలకు ఎప్పుడు చేయాలి? అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా అమ్మాయిలకు అన్నప్రాసన కార్యక్రమం ఐదు లేదా ఏడవ నెలలో చేయాలి. అదే అబ్బాయిలకు ఆరవనెల లేదా 8వ నెలలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన కార్యక్రమం ఎప్పుడు కూడా ఉత్తరాయన శుక్లపక్ష తిథులలో మాత్రమే చేయాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ముందుగా వినాయకుడికి పూజ నిర్వహించిన తర్వాత బిడ్డ తండ్రి కుడి తొడపై కూర్చోబెట్టుకుని వెండి స్పూనుతో మనం తయారు చేసిన తీపి పదార్థాన్ని ముందుగా బిడ్డ మేనమామ శిశువుకు మూడుసార్లు తినిపించాలి.
ఆ తరువాత తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించాలి.
అన్నప్రాసన కార్యక్రమంలో చేసే పదార్థాలలో తప్పనిసరిగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ పదార్థాలతో పరమాన్నం తయారు చేసి బిడ్డకు తినిపించాలి. ఈ విధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…