మొబైల్స్ తయారీదారు రియల్‌మి గురువారం సి20, సి21, సి25 పేరిట మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కామన్‌గా అందిస్తున్నారు. సి20, సి21 ఫోన్లలో మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్ ఉండగా, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తుంది. అలాగే సి25 ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
రియల్‌మి సి20 స్మార్ట్ ఫోన్ కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. అయితే మొదటి 10 లక్షల మందికి ఈ ఫోన్‌ను రూ.6799కే అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌ను ఏప్రిల్ 13వ తేదీ నుంచి విక్రయిస్తారు.
రియల్‌మి సి21 స్మార్ట్ ఫోన్ క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.7,999 ఉండగా, 4జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.8,999 గా ఉంది. దీన్ని ఏప్రిల్ 14 నుంచి విక్రయిస్తారు.
రియల్‌మి సి25 స్మార్ట్ ఫోన్ వాటరీ గ్రే, వాటరీ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ మోడల్ ధర రూ.9,999గా ఉంది. 128జీబీ మోడల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. దీన్ని ఏప్రిల్ 16 నుంచి విక్రయిస్తారు. అన్ని ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…