మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. రియల్‌మి 8 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 5జి కి ఇందులో సపోర్ట్ లభిస్తుంది. యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపు ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో లభిస్తుంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
రియల్‌మి 8 5జి ఫోన్ సూపర్‌సోనిక్ బ్లూ, సూపర్‌సోనిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…