BSNL Vs Jio : జియో క‌న్నా చాలా త‌క్కువ‌కే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌.. ఏడాది వాలిడిటీతో..!

January 15, 2026 9:13 PM

BSNL Vs Jio : ప్రైవేటు టెలికాం సంస్థ‌లైన వొడాఫోయ‌న్ ఐడియా, ఎయిర్‌టెల్‌, జియోలు ఈమ‌ధ్యే త‌మ మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వినియోగ‌దారులు పెద్ద ఎత్తున BSNLకు మారిపోతున్నారు. త‌మ మొబైల్ నంబ‌ర్ల‌ను ఎంఎన్‌పీ ద్వారా BSNLకు మారుస్తున్నారు. BSNLలో త్వ‌ర‌లో 4జి రానుండ‌డంతో BSNLపై వినియోగ‌దారుల ఆస‌క్తి పెరిగింది. పైగా ప్రైవేటు టెలికాం సంస్థ‌ల‌తో పోలిస్తే BSNLలో చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే మొబైల్ ప్లాన్ల‌ను అందిస్తున్నారు.

ఇక ఏడాది వాలిడిటీ ఉండే ఒక ప్లాన్ వాస్త‌వానికి జియోలో క‌న్నా BSNLలోనే త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంది. BSNLలో రూ.1499 చెల్లిస్తే లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొంద‌వ‌చ్చు.ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులు.. అంటే దాదాపుగా ఏడాదిగా ఉంది. ఇందులో వినియోగ‌దారుల‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. అలాగే ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ నెట్‌వ‌ర్క్‌లో ఉచిత రోమింగ్ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో మొత్తంగా వినియోగ‌దారుల‌కు 24జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ డేటాను ఎప్పుడైనా ఉప‌యోగించుకోవ‌చ్చు. రోజుకు 100 ఉచిత SMS లు ల‌భిస్తాయి.

BSNL Vs Jio which one gives best one year validity with low cost
BSNL Vs Jio

BSNL అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా పైన చెప్పిన ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ల‌భిస్తాయి. ఇక ఎలాంటి బెనిఫిట్స్ మాత్రం ఉండ‌వు. కానీ ఇంట‌ర్నెట్ వినియోగం త‌క్కువ‌గా ఉండే వారు, కాల్స్ ఎక్కువ‌గా మాట్లాడేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇదే ప్లాన్ జియోలో మాత్రం కాస్త ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంది.

జియోలో ఏడాది వాలిడిటీ ల‌భించాలంటే క‌నీసం రూ.1899 చెల్లించాలి. ఇది BSNL క‌న్నా రూ.400 ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. అయితే జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు మొత్తంగా 24 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే 3600 SMS లు ల‌భిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌ల‌ను ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ధ‌ర ప్ర‌కారం చూస్తే BSNL లోనే ఏడాది వాలిడిటీ ప్లాన్ త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక త‌క్కువ ధ‌ర కావాల‌నుకునే వారు BSNL లోకి మారి ఈ ప్లాన్‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now