
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీ ధరను రూ. 9,699గా నిర్ణయించారు. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టీవీలో 36 వాట్ల స్టీరియో బాక్స్ స్పీకర్లు, సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో పాటు స్టాండర్డ్, స్పోర్ట్స్, మూవీ, మ్యూజిక్ వంటి పలు సౌండ్ మోడ్‌లను అందించారు. జియో స్టోర్ ద్వారా వినియోగదారులు 400కి పైగా ఓటీటీ యాప్‌లు, 400కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 300కి పైగా జియోగేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. కొత్త 32 అంగుళాల బ్లౌపంక్ట్ హెచ్‌డీ రెడీ జియోటెలీ ఓఎస్ స్మార్ట్ టీవీని రూ. 9,699 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దిశగా: అవ్‌నీత్ సింగ్ మార్వా
ఈ సందర్భంగా బ్లౌపంక్ట్ ఇండియాలో బ్రాండ్ లైసెన్సీగా ఉన్న ఎస్పీపీఎల్ సంస్థ సీఈవో అవ్‌నీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ, భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సులభమైన, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఇంటర్‌ఫేస్‌ను అందించాలనే లక్ష్యంతో జియోటెలీ ఓఎస్ టీవీలను తీసుకువచ్చామని తెలిపారు. పెద్ద స్క్రీన్ టీవీలకు వచ్చిన ఆదరణతో పాటు 32 అంగుళాల టీవీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, అన్ని వర్గాలకు కూడా ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు.
అద్భుతమైన విజువల్స్, జియో టెలీ ఓఎస్..
ఈ టీవీలో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది స్పష్టమైన విజువల్స్, సహజమైన రంగులు, మెరుగైన క్లారిటీని ఇస్తుంది. బెజెల్-లెస్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన 36 వాట్ల స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జియోటెలీ ఓఎస్ ద్వారా సులభమైన, క్లట్టర్ లేని స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించడంతో పాటు, వినియోగదారుల వీక్షణ అలవాట్లు, భాషా అభిరుచులు, ప్రాంతీయ రుచులను బట్టి కంటెంట్‌ను సూచించే ఏఐ ఆధారిత రికమెండేషన్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు. అదేవిధంగా, 10కు పైగా భారతీయ ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చే వాయిస్ సెర్చ్ సౌకర్యం, అమ్‌లాజిక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌తో వేగవంతమైన పనితీరు అందించనుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, జియో సినిమా, హాట్‌స్టార్‌కు ప్రత్యేక షార్ట్‌కట్ కీలు ఉన్న వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ కూడా ఇందులో భాగంగా లభిస్తుంది.








