సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. అతన్ని కెప్టెన్‌గా తొలగిస్తూ ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అతని స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ జట్టు యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏమాత్రం బాగా లేదు. ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో వార్నర్‌పై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ క్రమంలో వార్నర్ స్థానంలో విలియమ్సన్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
అయితే ఈ సీజన్ లో వార్నర్ బ్యాట్స్‌మన్‌గా కూడా పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం 193 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ 55 బంతులు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అందరిచే వార్నర్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతను ఆ మ్యాచ్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు కూడా చెప్పాడు. అయితే బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించలేకపోతున్నందున హైదరాబాద్ ఆడే తదుపరి మ్యాచ్‌లలో వార్నర్‌కు చోటు దక్కకపోవచ్చని భావిస్తున్నారు. అతని స్థానంలో ఇతర విదేశీ ఆటగాళ్లను ఆడించాలని చూస్తున్నారు.
ఇక 2018లో డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఉన్న సమయంలో ఒక సీజన్‌లో హైదరాబాద్‌కు విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ సీజన్‌లో విలియమ్సన్ బ్యాట్స్‌మన్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. అందుకనే విలియమ్సన్‌ను మళ్లీ జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. మరి ఇకనైనా హైదరాబాద్ విజయాల బాట పడుతుందో, లేదో చూడాలి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…