యువ క్రికెట‌ర్ల‌కు కార్ల‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చిన ఆనంద్ మ‌హీంద్రా..!!

April 2, 2021 10:04 PM

భార‌తీయుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డంలో మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే తాజాగా ఆయ‌న క్రికెట‌ర్లు శార్దూల్ ఠాకూర్‌, టి.న‌ట‌రాజ‌న్‌ల‌కు వారి ప్ర‌తిభ‌కు ప్రోత్సాహ‌కంగా మ‌హీంద్రా కంపెనీకి చెందిన థార్ కార్ల‌ను బ‌హుక‌రించారు. అయితే ఆనంద్ మ‌హీంద్రా పంపిన గిఫ్ట్‌ల‌ను అందుకున్న ఆ క్రికెట‌ర్లు ట్విట్ట‌ర్‌లో ఆయ‌నకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

anand mahindra given thar cars to shardul thakur and natarajan

ఆస్ట్రేలియాలో జ‌రిగిన బార్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీని భార‌త్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న విష‌యం విదిత‌మే. అందులో ప‌లువురు యువ క్రికెట‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆనంద్ మ‌హీంద్రా అప్ప‌ట్లోనే వారిని ప్ర‌శంసించారు. అయితే తాజాగా వారిలో శార్దూల్ ఠాకూర్‌, టి.న‌ట‌రాజ‌న్‌ల‌కు ఆయ‌న థార్ కార్ల‌ను బ‌హుమ‌తులుగా పంపించారు. ఆ కార్ల‌ను పొందిన ఠాకూర్‌, న‌ట‌రాజ‌న్‌లు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కొత్త మ‌హీంద్రా థార్ వ‌చ్చింది. మ‌హీంద్రా కంపెనీ రూపొందించిన ఈ కార్ అద్భుతంగా ఉంది. దీన్ని పంపింనందుకు ఆనంద్ మ‌హీంద్రాకు కృత‌జ్ఞ‌త‌లు.. అంటూ శార్దూల్ ఠాకూర్ ట్వీట్ చేశాడు. అలాగే న‌ట‌రాజ‌న్ కూడా ట్వీట్ చేశాడు. భార‌త్‌కు ఆడుతున్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని, కార్‌ను గిఫ్ట్‌గా పంపినందుకు ధ‌న్య‌వాదాల‌ని, ఆనంద్ మ‌హీంద్రాకు త‌న ఆటోగ్రాఫ్‌తో కూడిన ష‌ర్ట్‌ను పంపిస్తాన‌ని చెప్పాడు.

అయితే న‌ట‌రాజ‌న్ ట్వీట్‌కు ఆనంద్ మ‌హీంద్రా స్పందించారు. ఆ ష‌ర్ట్‌ను ఓ సంప‌ద‌లా దాచుకుంటాన‌ని, గ‌ర్వంగా దాన్ని ధ‌రిస్తాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య జ‌రిగిన ట్వీట్ల సంభాష‌ణ వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు త‌మ దైన శైలిలో ఈ విష‌యం ప‌ట్ల స్పందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment