Watch : రేడియో.. టీవీ.. కంప్యూటర్.. ల్యాప్‌టాప్.. టాబ్లెట్.. ల్యాండ్ లైన్.. సెల్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. ఇలా దేంట్లో చూసినా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డివైస్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. అవన్నీ వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. కొత్తగా వచ్చేవన్నీ పాత వాటిని మరిచిపోయేలా చేశాయి. అయితే ఓ వస్తువును మాత్రం మనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. అంటే, అందులోనూ కొత్త తరహా మోడల్స్ వచ్చాయనుకోండి, కానీ పాత తరం మోడల్స్‌ను రీప్లేస్ చేయలేకపోయాయి. అవే రిస్ట్ వాచ్‌లు. అవును, అవే.
స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ బ్యాండ్‌లు రంగ ప్రవేశం చేసినా సాధారణ రిస్ట్ వాచీల వాడకం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అధిక శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే రిస్ట్ వాచ్ అయినా, స్మార్ట్‌వాచ్ లేదా స్మార్ట్ బ్యాండ్ ఏదైనా వాటిని మనం దాదాపుగా ఎడమ చేతికే పెట్టుకుంటాం. కదా..! అంటే కుడి చేతికి పెట్టుకునే వారు కూడా ఉన్నారనుకోండి, కానీ వారు చాలా తక్కువగా ఉంటారు. వారి విషయం పక్కన పెడితే, అసలు వాచ్‌లను మనం ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటామో తెలుసా..? ఈ విషయం మీరెప్పుడైనా ఊహించారా..? అయితే ఇప్పుడు మాత్రం ఊహించాల్సిన పనిలేదు. ఎందుకంటే… ఇది చదవండి..! వాచీని ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుస్తుంది..!
ఇప్పుడంటే రిస్ట్ వాచీలు ఉన్నాయి కానీ అసలు వాచ్‌లను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచీలే ఉండేవి. జనాలు వాటిని తమ జేబులో పెట్టుకుని తిరిగేవారు. కావల్సినప్పుడు బయటికి తీసి టైం చూసుకునే వారు. అయితే కొందరు ఆ పాకెట్ వాచీలను చేతికి ధరించడం మొదలు పెట్టారు. అలా ధరించే క్రమంలో వారు తమ ఎడమ చేతికి వాచ్‌లను పెట్టుకునే వారు. ఎందుకంటే.. దాదాపుగా చాలా మంది కుడి చేతి వాటం కలవారే కాబట్టి కుడి చేత్తో పనిచేస్తున్న సందర్భంలో మాటి మాటికీ చేతిని పైకి లేపి టైం చూడడం ఇబ్బందవుతుందని భావించి, వాచ్‌లను ఎడమ చేతికి ధరించడం షురూ చేశారు.
అది అప్పట్లో వారికి సౌకర్యవంతంగా అనిపించింది. దీన్ని చూసి ఇతరులు కూడా అలా ధరించడం స్టార్ట్ చేశారు. దీంతో అలా అలా పలు కంపెనీలు రిస్ట్ వాచ్‌లను తయారు చేయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అందరూ వాచ్‌లను ఎడమ చేతికే ధరించడం మొదలు పెట్టారు. అలా ధరించడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, బ్యాండ్‌లు వచ్చినా వాటిని కూడా దాదాపుగా అధిక శాతం మంది ఎడమ చేతికే ధరిస్తున్నారు. సో, వాచ్‌లను ఎడమ చేతికి ధరించడం వెనుక ఉన్న అసలు కథ అది. తెలుసుకున్నారుగా..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…