Rooster : సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేచే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండేవారు ఉదయం సహజంగానే ఆలస్యంగా నిద్రలేస్తారు. ఇక రాత్రి త్వరగా పడుకునేవారు ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తుంటారు. వీరిలో కొందరు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేస్తారు. అయితే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే.. కొందరు కోడికూతతో ఉదయాన్నే మేల్కొంటారు. అవును.. ఇప్పుడంటే సిటీ కల్చర్ వచ్చింది కాబట్టి కోళ్లు ఉండడం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కోడి కూతతో నిద్ర లేచే వారు చాలా మందే ఉన్నారు. అయితే మనిషి కన్నా ముందే కోళ్లు ఎలా నిద్రలేవగలుగుతాయి..? వాటికి సూర్యుడు ఉదయించబోతున్నాడన్న విషయం ఎలా తెలుస్తుంది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం రాత్రి ఆలస్యంగా పడుకుంటాం. కానీ పశువులు, ఇతర జంతువులు, పక్షులు చీకటి పడగానే నిద్రిస్తాయి. కనుక అవి ఉదయం త్వరగా నిద్ర లేస్తాయి. ఇక ముఖ్యంగా కోళ్ల జీవ గడియారం.. అంటే బయోక్లాక్ మనకన్నా కాస్త ముందే ఉంటుందట. అది వాటికి మనకన్నా వేగంగా పనిచేస్తుందట. కనుక సూర్యుడు ఉదయించే విషయాన్ని అవి సుమారుగా 45 నిమిషాల ముందే పసిగడతాయట. అందువల్ల సూర్యుడు ఉదయించే విషయాన్ని అవి గుర్తించి అందుకు అనుగుణంగా కూస్తాయి. దీంతో వాటి కూత విన్న మనకు సహజంగానే మెళకువ వస్తుంది.
కోళ్ల బయో క్లాక్ వేగంగా పనిచేయడంతోపాటు మనకన్నా వెలుతురును గుర్తించే శక్తి కోళ్లకు ఎక్కువగా ఉండడం వల్లే అవి సూర్యుడు ఉదయించడానికన్నా ముందుగానే కూయగలుగుతున్నాయి. వెలుతురును చూస్తే వాటికి ఉత్సాహం వస్తుంది. అందుకనే దాన్ని అవి కనిపెట్టి కూయడం మొదలుపెడతాయి. సూర్యోదయానికన్నా ముందే ఇది జరుగుతుంది. దీంతో కోడికూతతో చాలా మంది మేల్కొంటారు. తరువాత సూర్యుడు ఉదయిస్తాడు. దీనివల్ల అందరూ పనులు చేసుకోవడం మొదలు పెడతారు. ఏది ఏమైనా.. ఇది మాత్రం ఒక వింతే కదా..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…