Cockroaches : ఇంట్లో బొద్దింకలు తిరుగుతుంటే.. యాక్.. వాటిని చూస్తేనే కొందరికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్రల దగ్గర అవి తచ్చాడితే ఇక ఆ పాత్రలను బాగా తోమి కానీ వాడకూడదు. ఇక బొద్దింకలు అనేవి ఇండ్లలోకి సహజంగానే వస్తుంటాయి. అయితే వాటిని తరిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్లర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింకలు చనిపోయినప్పటికీ వాటిని కెమికల్స్‌తో తయారు చేస్తారు కనుక.. ఆ కిల్లర్స్ మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. కనుక బొద్దింకలను సహజసిద్ధమైన పద్ధతిలోనే వదిలించుకోవాలి. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొద్దింకలు సాధారణంగా పసుపు రంగుకు ఆకర్షితమవుతాయట. కనుక కిచెన్‌లో ఆ రంగు ఉండకుండా చూసుకోవాలి. పాత్రలు కానీ, కూరగాయలు కానీ, ఇతర వస్తువులు కానీ ఎల్లో కలర్ ఉన్నవి తీసేయాలి. దీంతో బొద్దింకలు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి. దోసకాయ ముక్కల వాసన బొద్దింకలకు పడదు. కనుక కిచెన్‌లో వాటిని అక్కడక్కడా ఉంచితే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు. బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింకలు వచ్చే చోట చల్లితే బొద్దింకలు ఇన్‌ఫెక్షన్‌తో చనిపోతాయి.
సబ్బు నీళ్లను బొద్దింకలపై పోస్తే అవి వెంటనే చనిపోతాయి. బోరిక్ పౌడర్, చక్కెర పొడి, మొక్కజొన్న పిండిలను సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి. కిచెన్‌లో వీలైనంత వరకు మనం తినే ఆహార పదార్థాలు కింద పడకుండా చూసుకోవాలి. లేదంటే బొద్దింకలు వచ్చేస్తాయి. అలాగే కిచెన్ లో పాత్రల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…