ఆఫ్‌బీట్

ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మ‌ధ్య వాట్సాప్‌ సంభాష‌ణ‌.. చ‌దివి కామెంట్ చేయండి..!!

రాత్రి 11.30 గంట‌లు అవుతోంది. ఆమె నాతో వాట్సాప్‌లో చాట్ చేస్తోంది. ఆమెకు నిద్ర వ‌స్తోంది. కానీ నాకు నిద్ర రావ‌డం లేదు. ఆ రోజు ప‌గ‌లు నిద్ర‌పోయా. అందుక‌ని రాత్రి నిద్ర‌ రావ‌డం లేదు. ఆమె నాతో అన్న‌ది..

ఆమె: నాకు బాగా నిద్ర వ‌స్తోంది. గుడ్ నైట్‌. రేపు మాట్లాడుకుందాం.

నాకు ఇప్పుడ‌ప్పుడే నిద్ర ప‌ట్ట‌ద‌ని తెలుసు. అందుకే ఒక ప‌నిచేశా..

నేను: నేను నీకు ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా.

ఆమె: స‌రే, చెప్పు.

ఒక నిమిషం గ‌డిచింది. నేను రిప్లై ఇవ్వ‌లేదు. దీంతో ఆమెకు కుతూహ‌లం ఎక్కువైంది. ఆ విష‌యం ఏమిటి ? అనేది తెలుసుకునేందుకు ఆమె వెంట‌నే రిప్లై ఇచ్చింది.

ఆమె: ఏమైంది.. చెబుతావా ?

నేను: వ‌ద్దులే, ఆ విష‌యం నీకు చెబితే నీకు కోపం వ‌స్తుంది, ఇది స‌రైన టైమ్ కూడా కాదు, నీతో వాదించ‌లేను.

ఆమె: నో.. నాకిప్పుడు ఆ విష‌యం చెప్పాల్సిందే. నాకేమీ కోపం రాదులే, ఏమీ అనుకోను, చెప్పు.

నేను: నిద్ర వ‌స్తుంద‌న్నావు క‌దా.. నిద్ర‌పో.. అంతా మ‌ర్చిపో.. ఆ విష‌యం పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదులే.

ఆమెకు కుతూహ‌లం మ‌రింత ఎక్కువైంది. నిద్ర బాగా వ‌స్తుంద‌ని చెప్పింది. కానీ నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఎలాగైనా ఆ విష‌యం తెలుసుకోవాలని ఆమెకు ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది.

ఆమె: ప్లీజ్ చెప్పు. అస‌లు విష‌యం ఏమిటి ? అది నాకు సంబంధించిందేనా ?

నేను: కాదు, నువ్వు నిద్ర‌పో. నీకు కోపం వ‌స్తుంద‌ని తెలుసు. నేను రిస్క్ తీసుకోలేను.

చివ‌ర‌కు ఆమె గంట పాటు విష‌యం చెప్పాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. త‌రువాత నేను ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయా. అప్ప‌టికి రాత్రి 2 గంట‌లు అవుతోంది. ఆమె మాత్రం చాట్ చేస్తూనే ఉంది.

ఆమె: ప్లీజ్‌.. నాకు నిద్ర రావ‌డం లేదు, అసలు విష‌యం ఏమిటో చెప్పు.

కొన్ని గంట‌ల క్రితం ఆమె త‌న‌కు బాగా నిద్ర వ‌స్తుంద‌ని చెప్పింది. కానీ అప్పుడు నాకు నిద్ర రావ‌డం లేదు. దీంతో చిన్న‌గా ఏదో ఒక విష‌యం చెప్పాల‌ని ఆమె మైండ్‌లో అనుమానం సృష్టించా. అస‌లు నిజానికి ఆమెకు చెప్పాల్సిన విష‌యం ఏమీలేదు. స‌ర‌దాకి అలా అన్నా. కానీ ఆమె సీరియ‌స్ తీసుకుంది. రాత్రి నేను ప్ర‌శాంతంగా నిద్ర‌పోయా. కానీ ఆమెకు నిద్ర ప‌ట్ట‌లేదు.

త‌రువాత రోజు ఆమె రియాక్ష‌న్ ఇలా అనిపించింది..!

నిజానికి అది చాలా వింత‌గా అనిపించింది. కొంద‌రి మైండ్ అలాగే ఉంటుంది. ఏదైనా అనుమాన బీజం నాటితే దాని గురించి తెలుసుకోవాల‌ని వారికి కుతూహ‌లంగా ఉంటుంది. అది నెగెటివ్‌గా ప్ర‌భావం చూపిస్తుంది. ఓవ‌ర్‌గా ఆలోచిస్తారు. కొంద‌రి మైండ్‌లు ఇలాగే ప‌నిచేస్తాయి. వీటిని కొంద‌రు త‌మకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆమె విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. అస‌లు ఆమెకు చెప్పాల్సిన విష‌యం ఏమీ లేక‌పోయినా ఒక అనుమానం ఆమెను నిద్ర ప‌ట్ట‌నివ్వ‌లేదు. కొంద‌రిపై ఇది నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM