సాఫ్ట్‌వేర్ సంస్థకు గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్‌లో మనం ఏమైనా వెదకవచ్చు. వార్తలు, విషయాలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా ఏ సమాచారం అయినా వెదకవచ్చు. అయితే అందులో ఇమేజెస్ సెక్షన్‌ను ఓపెన్ చేసి దాంట్లో 241543903 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. దీంతో ఒక విచిత్రమైన సీక్వెన్స్‌ను మీరు చూస్తారు.
పైన చెప్పిన విధంగా నంబర్‌ను గూగుల్ ఇమేజెస్‌లో వెదికితే అన్నీ దాదాపుగా ఒకేలాంటి ఇమేజెస్ వస్తాయి. ఫ్రీజర్‌లో తలపెట్టిన ఇమేజెస్‌ను మనం చూడవచ్చు. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే..
2009లో టంబ్లర్ అనే సోషల్ మీడియా సైట్‌లో డేవిడ్ హార్విట్జ్ అనే వ్యక్తి తాను కొత్తగా కొన్న ఫ్రిజ్‌కు చెందిన ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ఫ్రీజర్‌లో అతను తన తలను ఉంచి దాన్ని ఫొటో తీసి ఆ సోషల్ సైట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది.
ఆ ఫోటోకు డేవిడ్ పైన తెలిపిన 241543903 నంబర్‌ను టైటిల్‌గా పెట్టాడు. అయితే అప్పటి సోషల్ సైట్ ఆర్కుట్‌లో కొందరు ఇలాగే ఫొటోలు తీసి వాటికి ఇదే నంబర్‌ను పెట్టి పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది ఇలాగే చేయడం మొదలు పెట్టారు. అలా ఈ నంబర్‌ను గూగుల్ ఇమేజెస్‌లో సెర్చ్ చేస్తే మనకు ఫ్రీజర్‌లో తలపెట్టిన ఫొటోలు రాసాగాయి. ఈ ట్రెండ్ చాలా రోజుల పాటు కొనసాగింది.
అందుకనే మనం ఈ నంబర్‌ను ఇప్పటికీ గూగుల్ ఇమేజెస్‌లో సెర్చ్ చేసినా మనకు అన్నీ ఫ్రీజర్‌లో తలలు పెట్టిన ఫొటోలే వస్తాయి. ఇదీ.. ఈ నంబర్‌కు, ఈ ఫోటోలకు వెనుక ఉన్న అసలు కారణం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…