ఆఫ్‌బీట్

Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Blood Groups : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్‌ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. బ్లడ్‌ గ్రూప్స్‌ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు. అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా.. అదేనండీ.. మా వంశం, మా రక్తం చరిత్ర.. అని డైలాగ్‌ లు ఉంటాయి కదా. అవే.. అయితే ఆ డైలాగ్‌ లను ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు కానీ.. నిజంగా రక్తానికి మాత్రం వ్యక్తిగత చరిత్ర ఉంటుంది. అంటే.. ఒక్కో రకమైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వారికి ఒక్కో రకమైన మనస్తత్వం, వ్యక్తిత్తం ఉంటాయి. మరి ఏ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వారు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకుందామా.

ఎ పాజిటివ్‌ (A+) – వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే వారు అయి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారిని ముందుండి నడిపిస్తారు. వారికి ప్రోత్సాహం అందిస్తారు. చిన్న విషయం పట్ల కూడా తీవ్రంగా స్పందిస్తారు.

ఎ నెగెటివ్‌ (A-) – వీరు కష్టపడే తత్వం కలిగిన వారు అయి ఉంటారు. ఎంత సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించేదాకా వదలరు. అలాగే తాము అనుకున్నది సాధించడం కోసం ఎంతటి కష్టమైనా చేస్తారు. దాని ఫలితం అనుభవిస్తారు. ఏదైనా సాధించాలనుకుంటే చివరి దాకా విడిచి పెట్టరు.

Blood Groups

బి పాజిటివ్‌ (B+) – వీరు త్యాగశీలురు అయి ఉంటారు. తమ కోసమే కాక ఇతరుల కోసం కూడా త్యాగం చేస్తారు. అవసరం అనుకుంటే ఎంతటి విలువైన వస్తువునైనా వదిలేస్తారు. తాము అనుకున్న సిద్ధాంతం కోసం పని చేస్తారు. అందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు.

బి నెగెటివ్‌ (B-) – వీరికి స్వార్థం ఎక్కువ. ఎదుటి వారిని హింసించడమే పనిగా పెట్టుకుంటారు. ఏ విషయంలోనూ ఎవరితోనూ అస్సలు కాంప్రమైజ్‌ అవరు. సర్దుకుపోయే తత్వం అస్సలు ఉండదు. దేంట్లో అయినా కానీ ఇతరులతో పోటీ పడుతారు. తమకు నచ్చిందే చేస్తారు. అస్సలు కాంప్రమైజ్‌ కారు.

ఓ పాజిటివ్‌ (O+) – వీరు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు. మెమొరీ షార్ప్‌గా ఉంటుంది. ఏ పనిని అయినా యాక్టివ్‌గా చేస్తారు. అంతే యాక్టివ్‌గా పని పూర్తి చేస్తారు. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు. అయితే వీరిని అర్థం చేసుకోవడం మాత్రం ఇతరులకు సాధ్యమయ్యే పనికాదు. వీరిని ఎవరూ అసలు అర్థం చేసుకోలేరు.

ఓ నెగెటివ్‌ (O-) – వీరు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు ఉంటారు. బాగా రిజర్వ్‌డ్‌ అయి ఉంటారు. ఎవరితోనూ అంత సులభంగా మాట్లాడరు. తమ గురించి తామే బాధపడుతుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు.

ఏబీ పాజిటివ్‌ (AB+) – వీరికి దయ, జాలి గుణాలు ఎక్కువ. ఎంత సేపూ ఇతరులకు సహాయం చేయాలనే చూస్తారు. తమ గురించి తాము అంతగా పట్టించుకోరు. తోటి వారికి సహాయం చేయాలనే తపనను కలిగి ఉంటారు.

ఏబీ నెగెటివ్‌ (AB-) – వీరికి తెలివితేటలు ఎక్కువ. ఏ సమస్యను అయినా ఇట్టే పరిష్కరిస్తారు. అమోఘమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. ఎలాంటి చాలెంజ్‌ అయినా సరే సులభంగా ఎదుర్కొంటారు. పని పూర్తి చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM