Success : అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉంటారు. అయితే కొంతమందిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కలిగినట్లయితే వ్యక్తి జీవితంలో అన్నింటినీ జయించినట్లే. మరి వాటి గురించి చూసేద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆత్మబలంతో ఆపకుండా ముందుకు వెళ్లి పోతే కచ్చితంగా ఆ మనిషి జీవితంలో విజయం ఉంటుంది. అలాగే ఓర్పు గుణం ఉన్న వాళ్ళని ఏ శక్తులు ఏమీ చేయలేవు. క్షమా గుణంతో ఉంటే ఆ మనిషి ప్రతి దానిని, ప్రతి వారిని, ప్రతి విషయాన్ని కూడా క్షమాశక్తితో ఎదుర్కొంటాడు.
అలాగే కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు దాని మీదే ధ్యాస పెడుతూ ఉంటారు. సంపూర్ణంగా ఆ విషయంలోనే ఉంటారు. చదువుతున్నా లేదంటే ఏదైనా పని చేస్తున్నా, మాట్లాడుతున్నా కూడా పూర్తి ధ్యాస దాని మీదే ఉంటుంది. అటువంటి వాళ్ళకి తిరిగే ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా సరే సొంతంగా నిర్ణయం తీసుకోగలిగే వ్యక్తి కచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తాడు. మనసుని, శరీరాన్ని, మాటని, సంసారాన్ని, ఇంటిని, పరిసరాలని, వేసుకునే వస్త్రాలని శుభ్రంగా, శుచిగా ఉంచుకున్నట్లయితే ఆ మనిషికి ఇక తిరుగే ఉండదు.
తనని తాను తక్కువగా భావించకుండా, అన్నింట్లో కూడా ముందు ఉండే వ్యక్తి ఎప్పుడూ కూడా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాడు. నిగ్రహం లేని వాళ్ళకి ఏదో ఒక రోజు పతనం తప్పదని అందరికీ తెలుసు. కనుక ఆ అవకాశం ఇవ్వడం కూడా మంచిది కాదు. అవసరానికి అబద్ధాలు చెప్పకూడదు.
అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. పగ, ప్రతీకారాలు అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. వాళ్ళ అభివృద్ధికి ఆటంకాన్ని ఇస్తాయి. అయితే ఈ తప్పులు చేయకుండా మంచి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ మనిషికి ఇక ఎందులోనూ తిరుగు ఉండదు. అన్నింట్లో కూడా విజయం సాధిస్తారు. కనుక ఈ లక్షణాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఇంక తిరుగు ఉండదు. ఏదైనా సాధిస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…