10 రోజుల్లో 13 హార్ర‌ర్ మూవీల‌ను మీరు చూడ‌గ‌ల‌రా ? అయితే రూ.95వేలు మీవే..!

September 14, 2021 11:17 AM

సినీ ప్రేక్ష‌కులు భిన్న ర‌కాలుగా ఉంటారు. కొంద‌రికి కామెడీ మూవీలు అంటే ఇష్టం ఉంటుంది. కొంద‌రు యాక్ష‌న్ మూవీల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రికి రొమాంటిక్ మూవీలు న‌చ్చుతాయి. అయితే హార్ర‌ర్ మూవీలు అంటే ఇష్టం ఉండే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఆ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అదేమిటంటే..

10 రోజుల్లో 13 హార్ర‌ర్ మూవీల‌ను మీరు చూడ‌గ‌ల‌రా ? అయితే రూ.95వేలు మీవే..!

ఫైనాన్స్ బ‌జ్ అనే కంపెనీ హార్ర‌ర్ మూవీల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల కోసం అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఆ ప్రేక్ష‌కులు 10 రోజుల్లో 13 హార్ర‌ర్ మూవీల‌ను చూడాల్సి ఉంటుంది. దీంతో రూ.95వేలు ఇస్తారు. ఇక ఒక్కో మూవీకి అయ్యే రెంట‌ల్ ఖ‌ర్చుల కింద రూ.3600 వ‌ర‌కు ఇస్తారు. 10 రోజుల్లో వారు సూచించిన 13 హార్ర‌ర్ మూవీల‌ను చూడాల్సి ఉంటుంది.

మూవీల‌ను చూసే స‌మ‌యంలో వారు అందించే ఫిట్ నెస్ బ్యాండ్‌ను చేతికి ధ‌రించాలి. దీంతో వారు ప్రేక్ష‌కుల‌కు చెందిన హార్ట్ బీట్‌ను తెలుసుకుంటారు. మూవీ చూస్తున్న‌ప్పుడు భిన్న స‌మ‌యాల్లో హార్ట్ రేట్‌ను తెలుసుకుంటారు. ఆ డేటాను వారు త‌మ అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటారు.

ఇక ప్రేక్ష‌కులు చూడాల్సిన మూవీల‌లో సా, అమిటివిల్లె హార్ర‌ర్‌, ఎ క్వ‌యిట్ ప్లేస్, ఎ క్వ‌యిట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండీ మ్యాన్, ఇన్‌సైడియ‌స్‌, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్‌, సినిస్ట‌ర్‌, గెట‌వుట్‌, ది ప‌ర్జ్‌, హాలోవీన్ (2018), పారానార్మ‌ల్ యాక్టివిటీ, అన్నాబెల్ వంటి మూవీలు ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటే ద‌ర‌ఖాస్తుకు సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. 18 ఏళ్లు నిండిన వారు, అమెరికాలో ఉంటున్న వారు ఇందులో పాల్గొన‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment