Belly Button : బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం. కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్నా, అంద విహీనంగా ఉన్నా, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మనిషి శరీరంలో భాగంగా ఉండే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియా ఉంటుందట. శరీరంలో అపరిశుభ్రంగా ప్రదేశాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాభాలో కేవలం 4 శాతం మందికి మాత్రమే బొడ్డు బయటికి ఉంటుంది. మిగతా వారికి బొడ్డు లోపలికి ఉంటుంది. బయటికి ఉండే బొడ్డును ఫాల్టీ బెల్లీ అని కూడా పిలుస్తారు. శిశువు జన్మించినప్పుడు తల్లితో అనుసంధానమైన పేగును సరిగ్గా ముడి వేయకపోవడం వల్లే బొడ్డు అలా కొందరిలో బయటికి వస్తుంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే బొడ్డు లింట్ ఎక్కువగా ఉంటుంది. లింట్ అంటే డెడ్ స్కిన్ సెల్స్, వెంట్రుకలు తదితరాలో ఏర్పడే ఫైబర్ లాంటి మెత్తని పదార్థం. పురుషులకు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిలోనే ఈ లింట్ ఎక్కువగా ఉంటుంది.
స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణగా భావిస్తారు. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత గ్లామర్ మహిళగా పేరుగాంచిన ఓ మహిళకు మాత్రం అసలు బొడ్డే లేదు. క్షీరద జాతికి చెందిన జీవుల్లో మాత్రమే బొడ్డు ఉంటుంది. గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే జీవరాశుల్లో బొడ్డు ఉండదు. బొడ్డుకు పియర్సింగ్ (పోగు) చేయించుకోవడం నేడు ఎక్కువైంది. అయితే ఇలా పియర్సింగ్ చేయించుకున్న తరువాత అయ్యే గాయం మానేందుకు దాదాపు 9 నెలలు పడుతుంది. అయితే ముక్కు, కనుబొమ్మలు, చెవులపై చేసే పియర్సింగ్ గాయం మానేందుకు కేవలం 6 వారాల సమయం మాత్రమే పడుతుంది.
ఆంగ్ల అక్షరం T ని పోలి ఉండే బొడ్డును అత్యంత సుందరమైందిగా చెబుతారు. ఇవి అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకమైన బొడ్డు ఉండదు. చేతి వేలి ముద్రల్లాగే ఇవి కూడా వేర్వేరుగా ఉంటాయి. బొడ్డును శరీరం మధ్యలో కలిగిన ఉన్న స్త్రీలు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారట.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…