Yamudiki Mogudu : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సుప్రీం హీరోగా.. ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు. తన కృషి, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలారు చిరు. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు.. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. వీటిలో ఒకటి యముడికి మొగుడు. సాంఘిక చిత్రాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న చిరంజీవి మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఎందుకు చేయడం అనుకున్న వారికి మరో హిట్ కొట్టి అందరి నోళ్లు మూయించాడు మెగాస్టార్.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1988లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ యముడిగా నటించారు. చిరు మిత్రులైన నటులు జీవీ నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో విజయశాంతి, చిరంజీవి పోటీపడి నటించారు. ఇందులో పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. సినిమాను చూసిన చాలా మంది దీనిని ఎన్టీఆర్ యమగోలను స్పూర్తిగా తీసుకుని చేశారని అనుకున్నారు. కానీ ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కిందంట. ఈ విషయాన్ని నటుడు నారాయణ రావు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
1978లో వచ్చిన హెవెన్ కెన్ వెయిట్ అనే సినిమాకు వారెన్ బీట్టీ, బక్ హెన్రీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. వారెన్ బీట్టీ హీరోగా నటించారు. దీనిని చూసిన తాను సత్యానంద్ యముడికి మొగుడు కథను రూపొందించినట్లు నారాయణ రావు తెలిపారు. అయితే యమలోకం అనే పాయింట్‌ను నాగబాబు సూచించారని ఆయన చెప్పారు. అయితే ఈ తరహా కథలు రాయడంలో సిద్ధహస్తుడైన డీవీ నరసరాజు దగ్గరకు వెళ్లామని.. కానీ తాను ఇప్పటికే అలాంటి కథలు రాసి ఉండడంతో సబ్జెక్ట్ కు ఓకే చెప్పారని నారాయణ రావు తెలిపారు.
స్టోరీ డిస్కషన్ సమయంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే పెద్దలు చెప్పే మాటను సత్యానంద్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీంతో సత్యానంద్ ని స్క్రీన్ ప్లే రైటర్ గా తీసుకుని.. ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లామని నారాయణ రావు తెలిపారు. ఇక ఈ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పటి వరకు సాధారణ నిర్మాతలుగా ఉన్న వారి జీవితాలే మారిపోయాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…