Soundarya : ఆమని.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ. జంబలకడిపంబ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమని తరువాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు వంటి సినిమాలు తన జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఆమని తప్ప మరే ఇతర హీరోయిన్ నటించినా అంతటి విజయాన్ని అందుకునేది కాదు అనే విధంగా ఆమని ఆ పాత్రలో నటించారు. పెళ్లయిన తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికి అంకితమై పోయిన ఆమని తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మధ్యాహ్నం హత్య అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.
ఆమని తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతోపాటు జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి హీరోల పక్కన కూడా నటించి హిట్లు కొట్టింది. అప్పట్లో ఒక సినిమాలో ఆమని ఉందంటే ఆ సినిమాకు హీరోతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆమని ఇటీవల చావు కబురు చల్లగా అనే సినిమాలో అలరించింది. ఆ సినిమానే కాకుండా పలు సూపర్ హిట్ సినిమాలలోనూ నటిస్తోంది. అలాగే పలు ప్రముఖ టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఆమని.. సౌందర్య సోదరుడిని వివాహం చేసుకోవాలని ఓ సందర్బంలో భావించిందట.
అప్పట్లో సౌందర్య, ఆమని మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. సౌందర్యతో మాత్రమే కాకుండా, తన కుటుంబంతో కూడా ఆమనికి ఎంతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒకరోజు సౌందర్యతో కలిసి వారి ఇంటికి వెళ్ళినప్పుడు సౌందర్య తండ్రి మా అబ్బాయి అమర్‌ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. ఉన్నఫలంగా సౌందర్య తండ్రి ఆ విధంగా అడగడంతో అప్పుడు ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాము. అయితే ఆ రోజు మాతో పాటు తెలంగాణ శకుంతల కూడా అక్కడ ఉన్నారు.
సౌందర్య నాన్నకి తెలియని విషయం ఏమిటంటే.. అమర్ కి కాలేజ్ లో ఒక అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందనే విషయం తెలియక.. అమర్ ని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారని అసలు కారణం ఆమని తెలిపారు. అయితే కొద్ది రోజుల తర్వాత సౌందర్య తండ్రి మరణించిన తర్వాత అమర్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ సౌందర్య, తన సోదరుడు అమర్ ఇద్దరూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…