Krishna : ఎన్‌టీఆర్ కృష్ణ‌, బ‌ద్ద శ‌త్రువులుగా మార‌డానికి.. కార‌ణాలు ఇవే..!

Krishna : హీరో కృష్ణ‌ స్వ‌త‌హాగా ఎన్టీఆర్ అభిమాని. తెనాలి ర‌త్న థియేట‌ర్ లో చూసిన పాతాళ భైర‌వి సినిమా కృష్ణ మ‌న‌సులో చేర‌గ‌ని ముద్ర వేసింది. కృష్ణ చిన్న‌ప్ప‌టి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారు. న‌టుడుగా ప్ర‌య‌త్నించ‌డానికి చెన్నై వెళ్లిన‌ప్పుడు కృష్ణ మొద‌ట‌గా ఎన్టీఆర్ నే క‌లిశారు. చిన్న వ‌య‌స్సు కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాల పాటు నాట‌కాల‌లో న‌టించ‌మ‌ని కృష్ణకు స‌ల‌హా ఇచ్చిందే ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన త‌రువాత ఎన్టీఆర్, కృష్ణ క‌లిసి న‌టించిన మొద‌టి చిత్రం స్త్రీ జ‌న్మ‌. వీరు క‌లిసి న‌టించిన ప్ర‌తి సినిమాలో కూడా ఎన్టీఆర్ కు త‌మ్ముడి గానే కృష్ణ న‌టించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డం.. చాలా కాలం మాట్లాడుకోకుండా ఉండ‌డం కూడా జ‌రిగింది. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డానికి ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Krishna

దేవుడు చేసిన మ‌నుషులు చిత్రం ప్రారంభం కావ‌డానికి ముందు జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లకు కార‌ణ‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. పండంటి కాపురం చిత్ర వేడుక‌ల‌ల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడ‌క‌ల‌ల్లోనే కృష్ణ త‌న అభిమాన న‌టుడితో సినిమా తీయాల‌ని కోర‌గానే దానికి ఎన్టీఆర్ స‌రే అన్నారు. పండంటి కాపురం చిత్ర స‌మ‌యంలోనే జై ఆంధ్ర ఉద్య‌మం తీవ్ర స్థాయిలో ఉంది. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను చూసి చ‌లించిపోయిన కృష్ణ ఆ ఉద్య‌మానికి త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తూ ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ విష‌యం పై త‌ట‌స్థ వైఖ‌రిని అవంలంభిస్తున్న ఎన్టీఆర్, ఏఏన్ఆర్ ల‌కు కృష్ణ వైఖ‌రి న‌చ్చ‌లేదు. దీంతో కృష్ణతో క‌లిసి సినిమా చేయ‌న‌ని ఎన్టీఆర్ ప్ర‌క‌టించారు.

ఆవేశంలో అలా మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని కృష్ణ చెప్పినా కూడా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి ఆత్మ‌కూరులో జ‌రిగే హ‌రికృష్ణ వివాహానికి రావ‌ల్సిందిగా కృష్ణ ను ఆహ్వానించారు. దీంతో విజ‌య నిర్మ‌ల, కృష్ణ దంప‌తులు ఆ వివాహానికి హాజ‌ర‌య్యారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తొల‌గి దేవుడు చేసిన మ‌నుషులు సినిమాలో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఆ చిత్రం పూర్తి కాగానే త‌న త‌దుప‌రి చిత్రం అల్లూరి సీతారామ‌రాజు అని కృష్ణ ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని తానే తీస్తాన‌ని ఎన్టీఆర్ చాలా సార్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ఈ సినిమాను తీయ‌లేదు. కృష్ణ చేసిన ప్ర‌క‌ట‌న‌ను చూసి కోప‌గించుకున్న ఎన్టీఆర్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమా 100 రోజుల వేడుక‌కు హాజ‌ర‌వ్వ లేదు.

ఈ సినిమా కార‌ణంగా కృష్ణ, ఎన్టీఆర్ ల మ‌ధ్య‌ దూరం మ‌రింత పెరిగింది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య చాలా రోజులు మాట‌లు కూడా లేవు. అయిన‌ప్ప‌టికీ ఒక‌సారి వారాహి స్టూడియోస్ లో కృష్ణ, ఎన్టీఆర్ ఒకరికి ఒక‌రు ఎదురు ప‌డ్డారు. కృష్ణ వెళ్లి ప‌ల‌క‌రించ‌గానే ఎన్టీఆర్ కూడా మాట్లాడారు. అల్లూరి సీతారామ రాజు సినిమాను చూసి బాగా తీశావ‌ని కృష్ణను ప్ర‌శ‌సించారు ఎన్టీఆర్. ఆ త‌రువాత ఎన్టీఆర్ తీసిన దాన వీర శూర క‌ర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమాను తీశారు. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. ఈ రెండు చిత్రాలు కూడా 1977 లో సంక్రాంతికి పోటాపోటీగా విడుద‌లయ్యాయి. ఈ సినిమాల త‌ర్వాత అప్ప‌డ‌ప్పుడూ వీళ్లిద్ద‌రూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా కాలం వ‌ర‌కు వీరిద్ద‌రి మ‌ద్య ఎటువంటి గొడ‌వ‌లు లేవు.

ఇద్ద‌రూ క‌లిసి వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు అనే సినిమాలో కూడా న‌టించారు. ఆ త‌రువాత ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి వెళ్ల‌డం తెలుగు దేశం పార్టీని స్థాపించ‌డం, ఆ పార్టీ గుర్తుగా సైకిల్ ను ఎంచుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అదే స‌మ‌యంలో కృష్ణ ఈనాడు సినిమాలో రండి క‌ద‌ల‌రండి అనే పాట‌ను సైకిళ్ల మీద తీయ‌డంతో ఎన్టీఆర్ కు మ‌ద్ద‌తుగా అలా తీశారేమో అని అంద‌రూ అనుకున్నారు. ఎన్టీఆర్ ను అభినందిస్తూ కృష్ణ పేప‌ర్ లో ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు. ఈ త‌రువాత కొంత కాలం ఇద్ద‌రూ బాగానే ఉన్నారు.

1984 లో ముఖ్య‌మంత్రిగా ఎన్టీఆర్ ను కాంగ్రెస్ పార్టీ స‌హ‌కారంతో బ‌ల‌వంతంగా గ‌ద్దె దించి నాదెళ్ల భాస్క‌ర్ రావు ముఖ్య‌మంత్రి కాగానే ఆయ‌న‌ను అభినందిస్తూ కృష్ణ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంతో పెద్ద దుమార‌మే రేగింది. ఎన్టీఆర్ అభిమానులు ఆగ్ర‌హించి కృష్ణ సినిమాలు ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌పై దాడి చేశారు. ఆయ‌న పోస్ట‌ర్ ల‌ను త‌గ‌ల‌బెట్టారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక కృష్ణ మ‌రుస‌టి రోజే మ‌రో ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌ చేశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాన‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రూ ఉన్న వారికి నా అభినంద‌న‌లు తెల‌ప‌డం నాకు అల‌వాటు, నేను ఎవ‌రి మీద కోపంతోనూ ఆ ప్ర‌క‌ట‌న‌ను ఇవ్వ‌లేదు.. అని ప్ర‌క‌టించ‌డంతో ఆ గొడవ త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ ఈ ప‌రిణామాలు చూసిన నిర్మాత‌లు కృష్ణ సినిమాల విడుద‌ల‌ను వాయిదా వేశారు. మ‌ళ్లీ ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత కూడా కృష్ణ దాడుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. 1984 లో ఆనాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ స‌ల‌హా మేర‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఎన్టీఆర్ కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ వ్యంగ్య‌ చిత్రాల‌ను తీశారు కృష్ణ‌. రాజీవ్ గాంధీ మ‌ర‌ణాంత‌రం వీరిద్ద‌రి మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు జ‌ర‌గలేదు. ఇవీ.. కృష్ణ‌, ఎన్‌టీఆర్‌ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు.. సంబంధాలు.. చిత్రాల‌కు చెందిన అస‌లు విష‌యాలు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM