ఒకప్పుడు మన ఇండ్లలో చెక్కతో చేసిన కుర్చీలనే ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు రూపాంతరం చెందాయి. ప్లాస్టిక్‌తో తయారు చేసిన కుర్చీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి ధర తక్కువగా ఉండడంతోపాటు తేలిగ్గా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. విరిగిపోతే ఇబ్బంది ఉండదు. మళ్లీ కొత్త కుర్చీలను కొనవచ్చు. అందువల్ల ప్లాస్టిక్ కుర్చీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్‌గా కూర్చునే కుర్చీలు కాగా.. ఇంకో రకమైనవి స్టూల్ రూపంలో ఉంటాయి. వీటిని కూర్చునేందుకు లేదా టీపాయ్ మాదిరిగా ఉపయోగిస్తారు. అయితే ఈ కుర్చీల మధ్యలో రంధ్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కుర్చీలను ఒకదానిమీద ఒకటి పెట్టినప్పుడు వాటి మధ్యలో కొంత గాలి ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ సమయంలో కుర్చీ మధ్యలో హోల్ లేకపోతే ఆ మధ్యన ఉండే గాలి వల్ల అవి చాలా టైట్ గా ఇరుక్కుపోతాయి. దీంతో వాటిని విడదీయడం కష్టంగా మారుతుంది. కనుకనే అలాంటి చెయిర్స్‌కు మధ్యలో రంధ్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక కుర్చీలను తయారు చేసేటప్పుడు కొంత మెటీరియల్ ను పొదుపు చేయడం కోసం, తక్కువ ఖర్చులో కుర్చీని తయారు చేయడం కోసం ఈ రంధ్రాలను పెడతారు.
ఇక ఈ చెయిర్స్‌కు మధ్యలో రంధ్రాలు ఉండడం వల్ల వాటిని సులభంగా పట్టుకునేందుకు వీలవుతుంది. అలాగే వాటిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. అలాగే చెయిర్స్‌కు మధ్యలో ఎల్లప్పుడూ రంధ్రాలను వృత్తాకారంలోనే ఏర్పాటు చేస్తారు. చతురస్రాకారంలో రంధ్రాలు ఉండవు. ఎందుకంటే చెయిర్ మీద కూర్చున్నప్పుడు మనం కలిగించే ఒత్తిడి ఆ రంధ్రం ద్వారా బయటకు గాలి రూపంలో పోతుంది. దీంతో చెయిర్ ఎక్కువ కాలం మన్నుతుంది. అదే రంధ్ర లేకపోతే అదే ప్రదేశంలో కొంత కాలానికి సులభంగా పగులు ఏర్పడుతుంది. దీంతో కుర్చీ త్వరగా విరిగిపోతుంది. అందుకనే చెయిర్‌కు మధ్యలో రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా ఈ కుర్చీలకు మధ్యలో రంధ్రాలను ఏర్పాటు చేయడానికి వెనుక పలు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…