Cardiac Arrest : కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వ‌స్తుంది..? దాని వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

Cardiac Arrest : క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ కార‌ణంగానే చ‌నిపోయార‌ని వైద్యులు చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే కార్డియాక్ అరెస్ట్ వేరు, గుండె పోటు వేరు. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డితే గుండె కండ‌రాల‌కు స‌రిగ్గా ఆక్సిజ‌న్‌, ర‌క్తం స‌ర‌ఫ‌రా కావు. దీంతో గుండె పోటు వ‌స్తుంది. హార్ట్ ఎటాక్ అంటారు. కానీ కార్డియాక్ అరెస్ట్ వేరు.

కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చిన వారి గుండె కొట్టుకోవ‌డం సడెన్ ఆగిపోతుంది. గుండె నుంచి ర‌క్తం స‌ర‌ఫ‌రా కాదు. దీంతో మెద‌డుకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. ఫ‌లితంగా వెంట‌నే స్పృహ త‌ప్పి ప‌డిపోతారు. ఇలాంటి సంద‌ర్బాల్లో బ‌తికే అవ‌కాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉంటాయి. క‌నుక గుండె పోటు క‌న్నా కార్డియాక్ అరెస్ట్ అత్యంత ప్ర‌మాద‌మైంది.. అని తెలుస్తుంది. మ‌రి కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చేందుకు కార‌ణాలు ఏముంటాయి ? అంటే..

కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌నం పాటించే జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్ల‌తోపాటు గుండె సంబంధ వ్యాధులు ఉన్న‌వారికి కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

1. ర‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డంకులు ఏర్ప‌డ‌డం మూలంగా గుండె కండ‌రాల‌కు ర‌క్తం, ఆక్సిజ‌న్ స‌రిగ్గా స‌ర‌ఫ‌రా కావు. ఈ స్థితిలో చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అయితే ఇదే స్థితిలో కొంద‌రికి కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ర‌క్త‌నాళాలు బ్లాక్ అవ‌డాన్ని క‌రోన‌రీ ఆర్ట‌రీ డిసీజ్ అంటారు. గుండెను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేయించుకుంటే బ్లాక్స్ క‌నిపెట్టి వాటిని తొల‌గించుకోవ‌చ్చు. దీంతో హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

2. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన కొంద‌రికి స‌కాలంలో చికిత్స‌ను అందించ‌క‌పోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. అలాంటి వారిలో గుండె పంపింగ్ వ్య‌వ‌స్థ స‌రిగ్గా పనిచేయ‌దు. క‌నుక హార్ట్ ఎటాక్‌కు గురైన వారిని వీలైనంత త్వ‌ర‌గా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స‌ను అందించాలి. దీంతో కార్డియాక్ అరెస్ట్‌కు గురి కాకుండా రక్షించ‌వ‌చ్చు.

3. గుండె కండ‌రాల గోడ‌లు విస్త‌రించ‌డం వ‌ల్ల గుండె పెద్ద‌గా అయినట్లు క‌నిపిస్తుంది. దీంతోపాటు గుండె కండ‌రాల గోడ‌లు గ‌ట్టిప‌డతాయి. ఈ స్థితిని ఎన్‌లార్జ్ హార్ట్ లేదా కార్డియోమ‌యోప‌తి అంటారు. దీని వ‌ల్ల గుండె అసాధార‌ణ రీతిలో కొట్టుకుంటుంది. ప‌ల్స్ రేట్ లేదా బీపీ స‌రిగ్గా ఉండ‌దు. వేగంగా మారుతుంటుంది. ఈ స్థితి ఉన్నా కూడా వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని తేడా ఉంటే చికిత్స తీసుకోవాలి. లేదంటే కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డ‌తారు.

4. ఒత్తిడి లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల గుండె క‌వాటాలు లీక్ అవ‌డం, అక్క‌డి గ‌దులు పెర‌గ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వ‌స్తుంది.

5. పుట్టుక‌తోనే గుండెలో రంధ్రం పడ‌డం లేదా ఏదైనా లోపం ఉన్నా.. అలాంటి వారిలో కార్డియాక్ అరెస్ట్ స‌మ‌స్య వ‌స్తుంది.

6. కొంద‌రికి గుండె పంపింగ్ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఉంటాయి. దీంతో స‌డెన్‌గా గుండె ర‌క్తాన్ని పంపు చేయ‌డం ఆగిపోతుంది. దీన్నే గుండె ఎల‌క్ట్రిక‌ల్ వ్య‌వ‌స్థ‌లో లోపం అంటారు. ఈ విధంగా జ‌రిగినా కూడా కార్డియాక్ అరెస్ట్ వ‌స్తుంది.

అయితే పైన తెలిపిన‌వి గుండె సంబంధ వ్యాధుల‌కు చెందిన‌వి. అవేకాకుండా.. కుటుంబంలో ఎవ‌రికైనా పెద్ద‌ల‌కు గుండె స‌మ‌స్య‌లు ఉండ‌డం, హార్ట్ ఎటాక్ ల‌తో చ‌నిపోవ‌డం, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, నియంత్ర‌ణ‌లో లేని హైబీపీ, హై కొలెస్ట్రాల్‌, హై షుగ‌ర్ లెవ‌ల్స్‌, అధికంగా బ‌రువు ఉండ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, రోజూ శారీర‌క వ్యాయామం చేయ‌క‌పోవ‌డం లేదా అతిగా వ్యాయామం చేయ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వ‌స్తుంటుంది. క‌నుక వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు వహించాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు అవ‌స‌రం అయిన సూచ‌న‌లను పాటించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM