Costumes : సాధారణంగా సినిమా అంటేనే రిచ్‌గా తీయాలి. అన్నింటిలోనూ ప్రొడక్షన్ విలువలు చాలా రిచ్‌గా ఉండాలి. లేదంటే క్వాలిటీ అవుట్ పుట్ రాదు. ఇక సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా డైరెక్టర్ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే చిన్న తప్పు దొర్లినా చాలు.. ప్రేక్షకులు ట్రోల్ చేస్తారు. అయితే సాధారణంగా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు లేదా ఇతర నటీనటులు ధరించే దుస్తులు బ్రాండెడ్‌వే అయి ఉంటాయి. వాటిని రెంట్‌కు తీసుకువస్తుంటారు. లేదా కొన్ని సార్లు నటీనటులే తమ సొంత దుస్తులను ధరించి షూటింగ్‌లో పాల్గొంటారు.
అయితే అంతా బాగానే ఉంది. కానీ సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో నటీనటులు ధరించాల్సి వస్తే.. అప్పుడు బ్రాండెడ్ దుస్తులను ధరించేందుకు వీలు కాదు. మురికిగా ఉండే దుస్తులనే ధరించాలి. మరలాంటప్పుడు దుస్తులకు మురికి పూస్తారా.. మురికిలో ముంచాక దుస్తులను నటీనటులు వేసుకుంటారా.. అంటే.. కాదు.. దుస్తులు మురికిగా కనిపించేందుకు దర్శకులు ఒక టెక్నిక్ వాడతారు. అది ఏదంటే..
రంగస్థలం, పుష్ప సినిమాల్లో నటీనటులు అందరూ డీ గ్లామర్ లుక్‌లో కనిపించారు. అందరి దుస్తులు మురికిగానే ఉంటాయి. అయితే దుస్తులు అలా మురికిగా కనిపించేందుకు వారి దుస్తులను టీ లేదా కాఫీలలో ముంచి తీస్తారు. తరువాత ఎండబెడతారు. అనంతరం వాటిని ధరిస్తారు. దీంతో దుస్తులు మురికిగా కనిపిస్తాయి. క్యారెక్టర్‌కు తగినట్లు ఉంటాయి. అయితే ఈ విషయాన్ని సుకుమార్ గతంలో ఒకసారి చెప్పారు. అందువల్లే అందరికీ ఈ విషయం తెలిసింది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…