Peacock Feather : నెమ‌లి ఫించాన్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

July 22, 2022 1:39 PM

Peacock Feather : హిందూ పురాణాల ప్ర‌కారం నెమ‌లిని ఎంతో ప‌విత్ర‌మైన పక్షిగా భావిస్తారు. అందుక‌నే శ్రీ‌కృష్ణుడు త‌న త‌ల‌లో నెమ‌లి ఫించాన్ని ధ‌రిస్తాడు. పురాణాల్లోనూ అనేక చోట్ల నెమ‌లి ఫించం ప్ర‌స్తావ‌న ఉంది. అయితే నెమ‌లి ఫించాన్ని చిన్న‌త‌నంలో చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. దీన్ని పుస్త‌కాల్లో పెట్టుకుంటే పిల్ల‌లు పెడుతుంద‌ని అనుకునేవారు. అయితే వాస్త‌వానికి నెమ‌లి ఫించం మ‌న‌కు వాస్తు ప‌రంగా కూడా మేలు చేస్తుంది. దీని వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నెగెటివ్ ఎన‌ర్జీ పోతాయి. నెమ‌లి ఫించాన్ని ఏవిధంగా ఉప‌యోగిస్తే.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెమ‌లి ఫించాన్ని ఇంట్లో హాల్‌లో ఎవ‌రూ చూడ‌ని చోట ఉంచాలి. షెల్ఫ్‌ల‌లో పుస్త‌కాలు లేదా ఏవైనా వ‌స్తువుల వెనుక పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. ఇంట్లోని వారికి ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ధ‌నం బాగా సంపాదిస్తారు. ఇంట్లో అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉంటారు.

what happens if you put Peacock Feather in home
Peacock Feather

నెమ‌లి ఫించాన్ని భార్యాభ‌ర్త‌లు త‌మ బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే వారి మ‌ధ్య ఉండే క‌ల‌హాలు తొల‌గిపోతాయి. వారు అన్యోన్యంగా కాపురం చేస్తారు. నెమ‌లి ఫించం వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. ఇది అన్ని స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది.

విద్యార్థులు గ‌న‌క ఈ ఫించాన్ని పుస్త‌కాల్లో దాచి పెట్టుకుంటే వారు చ‌దువుల్లో రాణిస్తారు. విద్య చక్క‌గా అల‌వ‌డుతుంది. అలాగే ఇంట్లో బీరువాలో దీన్ని పెట్టుకుంటే ఆర్థిక స‌మస్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. ఇలా నెమ‌లి ఫించంతో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment