Vishwak Sen : విశ్వక్‌సేన్, రుక్సార్ ధిల్లాన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ మే 6వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సాధించినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. అయితే విశ్వక్ సేన్, దేవీ నాగవల్లిల మధ్య గొడవ కారణంగా ఈ మూవీకి కావల్సినంత పబ్లిసిటీ అయితే వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపలేదు. అయితే నెల రోజుల తరువాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది.
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్‌ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి స్పందనే లభిస్తోంది. ఇక ఈ మూవీకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి.
ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించగా.. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రవి కిరణ్ చోళ కథను అందించారు. సినిమా ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అయితే థియేటర్లలో అంతగా ఈ మూవీ హిట్ కాకపోయినా.. ఓటీటీలో అయినా హిట్ అవుతుందని మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…