Virat Kohli : ఊ అంటావా మావా.. పాట‌కి విరాట్ కోహ్లి చిందులు.. వీడియో..!

April 28, 2022 10:07 PM

Virat Kohli : విరాట్ కోహ్లి.. భార‌త క్రికెట్ జ‌ట్టు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్. ర‌న్‌మెషిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ప్రశ్న‌గా మారాడు. ఒక‌ప్పుడు వరుసగా ప‌రుగులు సాధించిన విరాట్ కోహ్లి.. బెంగ‌ళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విష‌యం తెలిసిందే. అత‌డు.. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ కేవలం 125 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీకి ఈ సీజన్ లో ఒక్క అర్ధ సెంచరీ లేకపోవడం విశేషం. 2016 ఐపీఎల్ సీజన్ లో ఎవరూ చేయనంతగా 973 పరుగులు చేసిన ఇతడు ఈ సీజన్ లో మాత్రం సింగిల్స్ తీయడానికే ఆపసోపాలు పడుతున్నాడు.

Virat Kohli dance to Pushpa movie song
Virat Kohli

విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చినప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. సాధారణంగా వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లి.. రాజస్థాన్‌పై మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగాడు. అనూజ్ రావత్‌కు బదులుగా కెప్టెన్ ఫ‌ఫ్‌ డుప్లెసిస్‌తో కలిసి జట్టు ఇన్నింగ్‌ను ఆరంభించాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. మళ్లీ విఫలం అయ్యాడు. మరోసారి గోల్డెన్ డక్‌ను ఎదుర్కొనబోయి తృటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. తొమ్మిది పరుగులే చేసి వెనుదిరిగాడు.

ఇక కోహ్లి బయో బబుల్ మధ్య కూడా ఆటగాళ్ల‌తో చాలా సరదాగా గడుపుతున్నాడు. అలాగే గ్రౌండ్‌లో సిక్స్‌లు మోత మోగించే ఆటగాళ్లు.. గ్రౌండ్ బయట కూడా చాలా సరదాగా ఉంటున్నారు. బుధవారం (ఏప్రిల్ 27) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు సందడి చేశారు. ఆటపాటలతో దుమ్మురేపారు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. నల్ల కుర్తా, పైజామా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. షాబాజ్ అహ్మద్, డు ప్లెసిస్‌తో కలిసి మాక్స్‌వెల్ వెడ్డింగ్ ఈవెంట్‌లో రచ్చ రచ్చ చేశాడు కోహ్లి. షాబాజ్ అహ్మద్‌తో కలసి ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అనే పుష్ప‌ పాటకు స్పెప్పులు వేశాడు. కాగా విరాట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now