Viral Video : కారు ఢీకొన‌బోగా.. బాలిక‌ను ప‌క్క‌కు లాగి ర‌క్షించిన మ‌హిళా పోలీసు.. వీడియో వైర‌ల్‌..!

Viral Video : ప్ర‌మాదాలు అనేవి అనుకోకుండానే జ‌రుగుతుంటాయి. చెప్పి జ‌ర‌గ‌వు. కానీ అవి జ‌రిగేట‌ప్పుడు స‌మ‌య‌స్ఫూర్తి, చాక‌చక్యంతో వ్య‌వ‌హ‌రించాలి. దీంతో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ కూడా అలాగే చేసింది. వేగంగా వ‌స్తున్న కారు ఢీకొట్ట‌బోయేలోగానే ఆమె ఆ బాలిక‌ను ప‌క్క‌కు లాగి ర‌క్షించింది. వివ‌రాల్లోకి వెళిలే..

Viral Video

అమెరికాలోని మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఉన్న నార్త్ ఈస్ట్ మిడిల్ స్కూల్ ఏరియాలో అన్నెట్ గుడ్ ఇయర్ అనే మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ గా గ‌త 14 ఏళ్ల నుంచి విధులు నిర్వ‌ర్తిస్తోంది. రోడ్డుపై వ‌చ్చే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పాద‌చారులు, వాహ‌న‌దారుల‌ను సుర‌క్షితంగా అక్క‌డి కూడ‌లి నుంచి క్రాస్ చేయించాలి. ఇదీ.. ఆమె రోజూ చేసే ప‌ని.

అయితే తాజాగా ఒక రోజు ఆమె య‌థావిధిగా డ్యూటీలో ఉంది. ఈ క్ర‌మంలోనే కూడ‌లి వైపు వేగంగా వ‌స్తున్న ఓ కారును ఆగాల్సిందిగా ఆమె సూచించింది. అప్పుడే ఓ బాలిక రోడ్డు దాటుతుండ‌గా.. ఆమె ఆ కారును ఆప‌మ‌ని సైగ చేసింది. అయితే ఆ కారు డ్రైవ‌ర్ దాన్ని ప‌ట్టించుకోలేదు. వేగంగా వ‌స్తూనే ఉన్నాడు. దీంతో ప్ర‌మాదాన్ని ఊహించిన అన్నెట్ రోడ్డు దాటుతున్న బాలిక‌ను వెంట‌నే ప‌క్క‌కు లాగింది. అదే స‌మ‌యానికి కారు కూడా వేగంగా వ‌చ్చింది. ఆమె ఆ బాలిక‌ను ప‌క్క‌కు లాగ‌కుండా ఉంటే ఆ కారు ఆ బాలిక‌ను ఢీకొట్టి ఉండేది. ఆమె లాగ‌డంతో ఆ బాలిక ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డింది.

ఇక ఈ సంఘ‌ట‌న మొత్తం అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. దీన్ని అక్క‌డి సెసిల్ కంట్రీ ఎగ్జిక్యూటివ్ డానియెల్ హార్న్‌బ‌ర్గ‌ర్ షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ గా మారింది. అంద‌రూ ఆ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ చేసిన ప‌నికి ఆమెను అభినందిస్తున్నారు. ఎంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడావంటూ ఆమెను కొనియాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోను ఇప్ప‌టికే చాలా మంది వీక్షించ‌గా.. అంద‌రూ ఆమెను ప్ర‌శంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM