Viral Video : వామ్మో.. ఇత‌నెవ‌రండీ బాబూ.. కింగ్ కోబ్రా త‌ల‌మీదే ముద్దు పెట్టుకున్నాడు..!

Viral Video : కింగ్ కోబ్రా అంటే.. ప్రపంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన పాము. దీని విషం ఎంత ప్ర‌మాద‌కరం అంటే.. ఇది కాటు వేసిన త‌రువాత మ‌నిషి 15 నిమిషాల్లోగా చ‌నిపోతాడు. ఇక దీని విషం చిన్న అణువంతైనా చాలు.. మ‌న‌ల్ని ప‌క్ష‌వాతం బారిన ప‌డేస్తుంది. అంత‌టి విష‌పూరిత‌మైన‌వి కింగ్ కోబ్రాలు. అయితే అలాంటి విష‌పూరిత‌మైన పాముల‌తో అంత సుల‌భంగా ఎవరూ విన్యాసాలు చేయ‌రు. ఎందుకంటే.. అవి కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. క‌నుక వాటితో ఆట‌లాడే సాహసం ఎవ‌రూ చేయ‌రు. అయితే కొంద‌రు ఔత్సాహికులు మాత్రం అలాంటి ఎంత‌టి విష‌పూరిత‌మైన పాములు అయినా స‌రే.. వాటితో విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇలాగే చేశాడు.

Viral Video

బ్రియాన్ బార్‌సిజిక్ అనే వ్య‌క్తికి పాముల‌తో ఆడుకోవ‌డం అంటే స‌ర‌దా. మొస‌ళ్లు.. ఇత‌ర ప్ర‌మాద‌క‌ర‌మైన జీవాల‌తోనూ అత‌ను విన్యాసాలు చేస్తుంటాడు. ఇక తాజాగా ఇత‌ను ఓ కింగ్ కోబ్రాతో ఆట‌లాడుకున్నాడు. దాని వెనుక‌గా వెళ్లి ఏకంగా దాని త‌ల‌మీద‌నే ముద్దు పెట్టుకున్నాడు. అయితే అత‌ను మొద‌టి సారి అలా చేసిన‌ప్పుడు పాము కోపంతో ముందుకు కాటు వేసేందుకు బుస‌లు కొట్టింది. కానీ అత‌ను వెనుక ఉన్నాడు క‌నుక కాటు నుంచి త‌ప్పించుకున్నాడు.

ఇక రెండోసారి కూడా అత‌ను పాము తల‌మీద అలాగే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆశ్చ‌ర్యంగా ఈసారి పాము క‌ద‌ల‌లేదు. అత‌ను చేస్తున్న ప‌నిని అది ఎంజాయ్ చేసిన‌ట్లు క‌నిపించింది. ఇలా బ్రియాన్ ఆ కింగ్ కోబ్రాతో విన్యాసాలు చేశాడు. ఈ క్ర‌మంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక కింగ్ కోబ్రాలు సుమారుగా 5.85 మీట‌ర్ల పొడ‌వు పెరుగుతాయి. అవి లేచి నిల‌బ‌డ్డాయంటే చాలా దూరం నుంచి కూడా విషంతో దాడి చేయ‌గ‌ల‌వు. అంత‌టి స‌మ‌ర్థ‌త‌ను ఆ పాములు క‌లిగి ఉంటాయి. క‌నుకనే అవి కింగ్ కోబ్రాలు అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM