Viral Video : పాములను చూస్తేనే కొందరు ఆమడ దూరం పారిపోతారు. కొందరికి పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక పాము ఎదురుగా వస్తేనా.. అంతే సంగతులు. బతుకు జీవుడా.. అంటూ ఎవరైనా పారిపోతారు. అయితే ఆ వ్యక్తికి మాత్రం పాము అంటే ఏమాత్రం భయం లేదు. పైగా భారీ తాచుపాముకు అతను స్నానం చేయించాడు. దాని తలపై రెండు బకెట్ల నీళ్లు కూడా పోశాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి పాము తలపై రెండు బకెట్ల నీళ్లను కుమ్మరించి స్నానం చేయించినట్లు చేశాడు. అది తాచు పామని చూస్తుంటేనే అర్థమవుతుంది. భారీగా పొడవుగా కూడా ఉంది. అంతటి పెద్ద పామును చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. దూరంగా పారిపోతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం భయపడకుండా పాము తలపై నీళ్లు పోశాడు. అయితే ఈ వీడియో చాలా పాతది. అయినప్పటికీ మళ్లీ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను షేర్ చేసింది 2020వ సంవత్సరం మే నెలలో. అప్పట్లో ఆ సమయంలో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మే నెలలో సహజంగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ వేడికి తాళలేక ఆ పాము అక్కడికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అందుకనే దాని వేసవి తాపాన్ని తగ్గించేందుకు అతను అలా చేశాడని తెలుస్తోంది. అయితే ఈ వీడియో పాతది అయినా ఇప్పుడు నెటిజన్లు దీన్ని తెగ వీక్షిస్తూ షేర్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో గురించి నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…