Vikram Movie Tina : విక్ర‌మ్ మూవీలో టీనా పాత్ర‌లో న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా ? షాక‌వుతారు..!

Vikram Movie Tina : లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల‌హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ఇంకా ప్ర‌ద‌ర్శితం అవుతూనే ఉంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. క‌మ‌ల‌హాస‌న్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా విక్ర‌మ్ నిలిచింది. ఈ క్ర‌మంలోనే అనేక మంది ఈ మూవీని ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌ను ప్ర‌తి ఒక్క‌రూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. చాలా రోజుల త‌రువాత క‌మ‌ల‌హాస‌న్ కూడా ఈ చిత్రంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు.

ఇక ఇందులో క‌మ‌ల‌హాస‌న్ మాజీ గూఢ‌చారి ఆఫీస‌ర్‌గా న‌టించారు. 1986లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీకి కొన‌సాగింపుగా ఈ మూవీని తీశారు. అందుక‌ని ఆ మూవీలోని క‌మ‌ల‌హాస‌న్ పాత్ర‌నే ఇందులోనూ తీసుకున్నారు. ఇక కొత్త విక్ర‌మ్ మూవీలో క‌థ మొత్తం డ్ర‌గ్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ క్ర‌మంలోనే చిత్రంలో క‌మ‌ల్‌తోపాటు మ‌ళ‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాసిల్‌, త‌మిళ న‌టులు విజ‌య్ సేతుప‌తి, సూర్య‌లు న‌టించి అల‌రించారు. ఇక త్వ‌ర‌లోనే విక్ర‌మ్ 2 కూడా వ‌స్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ మూవీలో చాలా మందిని ఆక‌ట్టుకున్న పాత్ర‌ల్లో ఏజెంట్ టీనా పాత్ర ఒక‌టి.

Vikram Movie Tina

 

ఏజెంట్ టీనా పాత్ర మ‌న‌కు చివ‌రి వ‌ర‌కు తెలియ‌దు. ఆమె ఇంట్లో సాధారణ ప‌నిమ‌నిషిగా ఉంటుంది. కానీ చివ‌ర‌కు ఏజెంట్ అని తెలుస్తుంది. అలాగే 20 మంది గూండాల‌పై ఒంటి చేత్తో పోరాడుతుంది. దీంతో ఆ ఫైట్ సీన్‌ను చూసి ప్రేక్ష‌కులు ఎంతో థ్రిల్ అయ్యార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక టీనా పాత్ర‌లో న‌టించింది ఉత్త‌రాది న‌టి అని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆమె ద‌క్షిణాదికి చెందిన‌వారే. ఆమె ఒక డ్యాన్స్ అసిస్టెంట్‌. సినిమా ఇండ‌స్ట్రీలో 30 ఏళ్లు నుంచి డ్యాన్స్ అసిస్టెంట్‌గానే కొన‌సాగుతోంది.

ఇక టీనా పాత్ర‌లో న‌టించిన డ్యాన్స్ అసిస్టెంట్‌ పేరు వాసంతి. ఈమెది చెన్నై. 1992 నుంచి ఈమె సినిమా ఇండ‌స్ట్రీలో డ్యాన్స్ అసిస్టెంట్‌గా కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది మాస్ట‌ర్స్ వ‌ద్ద ప‌నిచేసింది. ప్ర‌స్తుతం ఈమె దినేష్ అనే డ్యాన్స్ మాస్ట‌ర్ టీమ్‌లో మెంబ‌ర్‌గా ఉంది. ఈమె న‌య‌న‌తార‌, త్రిష‌, అనుష్క‌, అమీ జాక్స‌న్‌, స‌మంత, క‌త్రినా కైఫ్ త‌దిత‌ర హీరోయిన్ల‌కు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించింది. అయితే త‌మిళ న‌టుడు విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమాలో విజ‌య్ కాలేజ్ లో అంద‌రి ఎదుట డ్యాన్స్ చేసే పాట ఉంటుంది. వాతి క‌మింగ్ అనే ఈ పాట‌లో న‌టీన‌టుల‌కు వాసంతి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించింది. ఈ క్ర‌మంలోనే ఆమె ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కంట ప‌డింది.

విక్ర‌మ్ సినిమాలో టీనా అనే పాత్ర‌కు వాసంతి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని లోకేష్ భావించారు. దీంతో ఆమెను వెంట‌నే కాంటాక్ట్ అయ్యారు. ఆమెకు ఆడిష‌న్ చేసి ఓకే చేశారు. దీంతో ఆమెకు విక్ర‌మ్ మూవీలో న‌టించే చాన్స్ ల‌భించింది. అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఆమె కూడా ఎంతో పాపుల‌ర్ అయింది. త‌న‌కు అనేక మంది ఫోన్ కాల్స్ చేశార‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ త‌న న‌ట‌న‌కు త‌న‌ను అభినందించారని చెప్పింది. ఇక విక్ర‌మ్ మూవీ ప్ర‌స్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. దీన్ని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ యాప్‌లో చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం…

Friday, 27 February 2026, 10:00 PM

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు…

Friday, 27 February 2026, 9:23 PM

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM