గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Vijay Devarakonda : ప్రెస్ మీట్‌లో అదో మాదిరిగా కూర్చున్న విజ‌య్‌.. కార‌ణం చెప్పేశాడుగా..!

Vijay Devarakonda : న‌టుడు విజయ్ దేవ‌ర‌కొండ న‌డుచుకునే తీరే వేరు. సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న స్టైల్ ని ఏ ఇత‌ర హీరోతోనూ పోల్చ‌లేం అనేది అక్ష‌ర స‌త్యం. డొంక తిరుగుడు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడే వ్య‌క్తిత్వం…

Vijay Devarakonda : ప్రెస్ మీట్‌లో అదో మాదిరిగా కూర్చున్న విజ‌య్‌.. కార‌ణం చెప్పేశాడుగా..!

Vijay Devarakonda : న‌టుడు విజయ్ దేవ‌ర‌కొండ న‌డుచుకునే తీరే వేరు. సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న స్టైల్ ని ఏ ఇత‌ర హీరోతోనూ పోల్చ‌లేం అనేది అక్ష‌ర స‌త్యం. డొంక తిరుగుడు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడే వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. అయితే తాజాగా జ‌రిగిన ఒక ప్రెస్ మీట్ లో ఇదే విష‌యాన్ని ఆయ‌న మ‌ళ్లీ నిరూపించారు. విజ‌య్ లేటెస్ట్ మూవీ లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా తెలుగు మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం జ‌రిగింది. అయితే ఈ మీటింగ్ లో విజ‌య్ రెండు కాళ్ల‌ను లేపి త‌న ముందు ఉన్న టేబుల్ పై పెట్టి కూర్చోవ‌డం జ‌రిగింది. మామూలుగా అయితే స‌మావేశాల్లో ఇలా చేయ‌డం అనేది అసాధార‌ణం. ఇంకా త‌ప్పుడు చ‌ర్య‌గా భావిస్తారు. ఒక విధంగా అమ‌ర్యాద‌గా కూడా అనిపిస్తుంది. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమాత్రం సంకోచించ‌కుండా ఆ ప‌ని చేసేశాడు.

ఇక విజ‌య్ ఇలా చేయ‌డానికి కార‌ణం మాత్రం వేరే ఉంది. ఆ స‌మావేశంలో ఒక విలేక‌రి విజ‌య్ ని ఉద్దేశించి ఆయ‌న పాన్ ఇండియా స్టార్ గా మారిన త‌రువాత త‌న‌కి ప్ర‌శ్న‌లు అడ‌గ‌డానికి సంకోచంగా, భ‌యంగా ఉంద‌ని అన్నారు. త‌న‌కి గ‌తంలో విజ‌య్ తో ప‌రిచ‌యం ఉన్న‌ప్ప‌టికీ త‌ను ఇదివ‌ర‌క‌టిలా విజ‌య్ ని ప్ర‌శ్న‌లు వేయ‌లేన‌ని త‌న మ‌న‌సులోని మాటను చెప్పాడు. దీనికి స‌మాధానంగా విజ‌య్ ఆ విలేక‌రితో.. టెన్ష‌న్ ప‌డ‌కుండా కంఫ‌ర్ట‌బుల్ గా ఉండ‌మ‌ని అన్నాడు.

Vijay Devarakonda told journalist to stay comfortable
Vijay Devarakonda

అవ‌స‌ర‌మైతే కాళ్లు ఇలా పెట్టుకొని కూర్చోమ‌ని సూచిస్తూ అలాగే టేబుల్ పై త‌న కాళ్లు పెట్టి చూపించారు. దీంతో అక్క‌డ ఉన్న‌వాళ్లంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌తో విజ‌య్ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. త‌ర‌చూ త‌న‌ని త‌ను అంద‌రికంటే భిన్న‌మైన వ్య‌క్తిగా చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి