Venkatesh : రియాలిటీ షోలు చేయ‌డం నా వల్ల కాదు.. అంటున్న వెంక‌టేష్.. ఎందుకో తెలుసా ?

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్.. ఈయ‌న గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయన అగ్ర హీరోల్లో ఒక‌రు. ప్ర‌స్తుతం భిన్న ర‌కాల సినిమాల్లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. మ‌ల్టీ స్టార‌ర్ మూవీల‌కు వెంక‌టేష్ ప్ర‌స్తుతం పెద్ద పీట వేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈయ‌న న‌టించిన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను కూడా వేగ‌వంతం చేశారు. ఇక ఈయ‌న ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

తెలుగు బుల్లితెర‌పై ఇప్ప‌టికే అనేక మంది స్టార్ హీరోలు యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించి మెప్పించారు. బిగ్‌బాస్ ద్వారా ఎన్‌టీఆర్‌, నాగార్జున‌, నాని ఆక‌ట్టుకోగా.. ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుతోనూ మెప్పించారు. చిరంజీవి కూడా ఇదే షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. అలాగే రానా ద‌గ్గుబాటి నంబ‌ర్ వ‌న్ యారి చేశారు. బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షోతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా స్టార్ హీరోలు ఇప్ప‌టికే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌గా.. వెంక‌టేష్ మాత్రం రియాలిటీ షోల‌ను చేయ‌డం లేదు. అయితే దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అని ఆయ‌నను అడ‌గ్గా.. అందుకు ఆయ‌న ఆశ్చ‌ర్య‌క‌రంగా స‌మాధానం ఇచ్చారు.

Venkatesh

రియాలిటీ షోలు అంటే.. కొన్ని సార్లు చెప్పిన డైలాగ్‌ల‌నే మ‌ళ్లీ చెప్పాలి. అదే యాక్ట్‌ను మ‌ళ్లీ రిపీట్ చేయాలి. అలా ఒక‌టి రెండు సార్లు అయితే చేయ‌గ‌లం. కానీ ప‌దే ప‌దే అలా చేయ‌డం నా వ‌ల్ల కాదు.. నేను అలా చేస్తుంటే ఒక‌ద‌శ‌లో బ్లాంక్ అయిపోతాను.. ఇంక నాతో కాదు.. అందుక‌నే రియాలిటీ షోల‌ను చేయ‌డం లేదు.. అని వెంక‌టేష్ స‌మాధానం ఇచ్చారు.

ఇక వెంక‌టేష్‌ను త‌న కుమారుడు ఎప్పుడు సినిమాల్లోకి వ‌స్తాడ‌ని ప్ర‌శ్నించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే త‌మ‌కు ఆ ఉద్దేశం లేద‌ని.. వారు ఏం అవ‌ద‌ల‌చుకున్నారో వారి ఇష్ట‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతానికి విద్యాభ్యాసం కొన‌సాగుతుంద‌ని.. అది పూర్త‌య్యాక త‌న కెరీర్‌పై తానే నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని.. వెంక‌టేష్ అన్నారు. కాగా వెంక‌టేష్ న‌టించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27 న రిలీజ్ కానుండ‌గా.. ఇందులో ఆయ‌న‌కు జోడీగా త‌మ‌న్నా యాక్ట్ చేసింది. వ‌రుణ్ తేజ్‌, మెహ్రీన్‌, సునీల్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు కూడా ఇందులో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. దిల్ రాజు నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM