Varun Tej : హీరోలు తమ శరీర ఫిట్‌నెస్ కోసం ఎప్పటికప్పుడు వ్యాయామాలు చేస్తుంటారు. ఇక సిక్స్ ప్యాక్ బాడీలు సరేసరి. వాటిని కాపాడుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఇక తాజాగా వరుణ్ తేజ్ కూడా తన బాడీని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. ఆయన నటించిన గని సినిమా విడుదలకు సరిగ్గా ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్‌కు చెందిన కొత్త స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
గని మూవీ కోసం వరుణ్ తేజ్ తన శరీరాన్ని మార్చిన తీరును చూసి అభిమానులు షాకవుతున్నారు. ముఖ్యంగా ఆయన లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కొత్త లుక్ చూసి ఫిదా అవుతున్నారు. వరుణ్ తేజ్ అంకిత భావాన్ని తెగ పొగిడేస్తున్నారు.
ఈ మూవీలో నటించేందుకు గాను వరుణ్ తేజ్ తన బాడీని పూర్తిగా మార్చేశారు. ఈ క్రమంలోనే ఆయన లుక్ ఇప్పటికే విమర్శకుల పొగడ్తలను కూడా అందుకుంది. అన్ని వర్గాల సినీ ప్రేక్షకులను గని అలరిస్తుందని చిత్ర యూనిట్ ఎంతగానో విశ్వసిస్తోంది.
ఈ మూవీని మేకర్స్ డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా జోనర్‌లో ఈ మూవీని కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. రీనెయిస్సెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీల బ్యానర్లపై సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అల్లు అరవింద్ ఈ మూవీకి సమర్పకులుగా ఉన్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…