Varun Tej : కేక పెట్టిస్తున్న వ‌రుణ్ తేజ్ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేషన్‌..!

November 4, 2021 10:32 AM

Varun Tej : హీరోలు త‌మ శ‌రీర ఫిట్‌నెస్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు వ్యాయామాలు చేస్తుంటారు. ఇక సిక్స్ ప్యాక్ బాడీలు స‌రేస‌రి. వాటిని కాపాడుకోవ‌డం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తుంటారు. ఇక తాజాగా వ‌రుణ్ తేజ్ కూడా త‌న బాడీని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. ఆయ‌న న‌టించిన గ‌ని సినిమా విడుద‌ల‌కు స‌రిగ్గా ఇంకో నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలోనే వ‌రుణ్ తేజ్‌కు చెందిన కొత్త స్టిల్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Varun Tej body transformation is mesmerizing

గ‌ని మూవీ కోసం వ‌రుణ్ తేజ్ త‌న శ‌రీరాన్ని మార్చిన తీరును చూసి అభిమానులు షాక‌వుతున్నారు. ముఖ్యంగా ఆయ‌న లేడీ ఫ్యాన్స్ అయితే ఆయ‌న కొత్త లుక్ చూసి ఫిదా అవుతున్నారు. వ‌రుణ్ తేజ్ అంకిత భావాన్ని తెగ పొగిడేస్తున్నారు.

ఈ మూవీలో న‌టించేందుకు గాను వ‌రుణ్ తేజ్ త‌న బాడీని పూర్తిగా మార్చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లుక్ ఇప్ప‌టికే విమ‌ర్శ‌కుల పొగ‌డ్త‌ల‌ను కూడా అందుకుంది. అన్ని వ‌ర్గాల సినీ ప్రేక్ష‌కుల‌ను గ‌ని అల‌రిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎంత‌గానో విశ్వ‌సిస్తోంది.

ఈ మూవీని మేక‌ర్స్ డిసెంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా జోన‌ర్‌లో ఈ మూవీని కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించారు. రీనెయిస్సెన్స్ పిక్చ‌ర్స్‌, అల్లు బాబీ కంపెనీల బ్యాన‌ర్ల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అల్లు అర‌వింద్ ఈ మూవీకి స‌మ‌ర్ప‌కులుగా ఉన్నారు. ఈ మూవీలో వ‌రుణ్ తేజ్‌, సాయి మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తి బాబు, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment