Ghani Movie : ఓటీటీలో గ‌ని.. మార్పులు, చేర్పుల‌తో.. థియేట‌ర్‌లో చూసిన దానికి భిన్నంగా రిలీజ్..!

April 21, 2022 5:57 PM

Ghani Movie : ఇటీవ‌లి కాలంలో సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల‌లోనే ఆ మూవీ ఓటీటీలో విడుద‌ల‌కి రెడీగా ఉంటుంది. రీసెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చిన గ‌ని చిత్రం కూడా ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గని అనే సినిమా స్పోర్ట్స్ డ్రామాలో తెర‌కెక్క‌గా ఈ సినిమాని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు. గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ సినిమా తెర‌కెక్క‌గా.. బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌ర‌చింది.

Ghani Movie OTT release different version from theatres
Ghani Movie

గ‌ని త‌ర్వాత బీస్ట్‌, కేజీఎఫ్ వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల‌వ‌డంతో గ‌ని వారంలోపే థియేట‌ర్లలో నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ ఆహాలో ఏప్రిల్ 22నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఆహా ఈ సినిమా కోసం కొత్త ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌ని థియేట్రిక‌ల్ క‌ట్ కి బ‌దులుగా నిర్మాత‌ల క‌ట్ ప్ర‌సారం చేయ‌బ‌డ‌నుంది.

నిర్మాతల కట్.. స్క్రీన్ ప్లే.. థియేట్రికల్ కట్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాక 10 నిమిషాలు ర‌న్ టైం కూడా పెర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నం ఇద‌ని అంటున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ని ఫ్లాప్ కావ‌డంతో ఆయ‌న అభిమానులు ఎఫ్ 3పై అంచ‌నాలు పెట్టుకున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్, తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్ట చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించార‌ని.. క‌నుక ఈ మూవీ హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment