Ghani Movie : వ‌రుణ్ తేజ్‌కి ఘోర‌మైన ప‌రాభవం.. గని ఎఫెక్ట్ వారిపై దారుణంగా ప‌డేలా ఉంది..!

April 12, 2022 11:13 AM

Ghani Movie : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించిన చిత్రం గ‌ని. స్పోర్ట్స్ డ్రామాలో రూపొందిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పూర్తి రన్‌లో రూ.4 కోట్లు కూడా కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాకు రూ.25.3 కోట్లలో రేంజ్ బిజినెస్ జరగగా.. రూ.26.30 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే ట్రాక్ తప్పింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో అసలు బిజినెస్ ను ఏ దశలోనూ అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిందనే చెప్పాలి.

Ghani Movie biggest flop in Varun Tej career
Ghani Movie

వీక్ డేస్ లో కూడా సినిమా ఇక తేరుకోలేకపోయిందనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అలాగే శ్రీరామనవమి కూడా అయినప్పటికీ కూడా టార్గెట్ ను కొంచెం కూడా అందుకునే ప్రయత్నం చేయలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే కంప్లీట్ గా ట్రాక్ తప్పింద‌నే చెప్పాలి. 3 కోట్లు కూడా రికవరీ కాలేదంటున్నారు. ఇంకా రూ.23 కోట్లు రికవరీ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రభావం డిస్ట్రిబ్యూటర్స్‌పై బాగానే ప‌డుతుంద‌ని అంటున్నారు. జనం ఇంకా ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. కేజీఎఫ్, బీస్ట్ వచ్చాక గ‌నికి ఆ కాస్త థియోటర్స్ కూడా ఉండకపోవచ్చు. ఎవరికీ ఈ సినిమాపై ఆసక్తి లేదు. పాపం వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అని చెప్పాలి.

సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్‌ అయిన 4-5 వారాల తర్వాత డిజిట‌ల్‌లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్‌ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్‌ 29నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియాలు కీల‌క‌పాత్ర‌లు పోషించిన సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment