Varun Tej : మెగా హీరోల‌కు వ‌రుణ్ తేజ్ త‌ల‌నొప్పిగా మారుతున్నాడా ?

November 23, 2021 8:42 AM

Varun Tej : మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌రు. ప్ర‌త్యేక‌మైన, విభిన్న‌మైన చిత్రాల‌ను తీస్తూ దూసుకుపోతున్నాడు. అగ్ర హీరోగా ఎదిగేందుకు కావ‌ల్సిన అన్ని ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్‌. అయితే వ‌రుణ్ తేజ్ సినిమాలు తీయ‌డం వ‌ర‌కు బాగానే ఉంది, కానీ వాటిని రిలీజ్ చేసే తేదీలే ఇత‌ర మెగా హీరోల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌ని అంటున్నారు.

Varun Tej becoming headache for mega heroes

వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ మూవీల‌తో మంచి హిట్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. త్వ‌ర‌లోనే గ‌ని సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ మూవీని డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. అయితే అంత‌కు వారం ముందు.. అంటే.. డిసెంబ‌ర్ 17వ తేదీన పుష్ప వ‌స్తోంది. ఇలా వారం రోజుల తేడాతో ఇద్ద‌రు మెగా హీరోల సినిమాలు రానున్నాయి.

ఈ విధంగా సినిమాలు రావ‌డం వ‌ల్ల ఇద్ద‌రికీ ఇబ్బందే అని విశ్లేష‌కులు అంటున్నారు. మెగా హీరోలు క‌నుక ఒక హీరో సినిమా వ‌చ్చాక క‌నీసం నెల రోజులు అయినా ఆగితే బాగుంటుందని, కానీ వారం వ్య‌వ‌ధిలో మూవీలు అంటే.. రెండు సినిమాల క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. దీంతో వ‌రుణ్ తేజ్ తోటి మెగాహీరోల‌కే పోటీ వ‌చ్చి వారికి త‌ల‌నొప్పిగా మారుతున్నాడ‌ని.. ఆయ‌న త‌న సినిమాల‌ను ఇత‌ర మెగా హీరోల సినిమాల తేదీల‌తో పోల్చి చూసి విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని అంటున్నారు.

అయితే వాస్త‌వానికి మెగా హీరోలు అని కాదు, సినిమాలు బాగుంటే.. ఎప్పుడు విడుద‌ల చేసినా హిట్టే అవుతాయి. దానికి తేదీల‌తో ప‌నిలేదు. సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాలి.. అంతే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment