Urfi Javed : ప్రేక్షకులు నన్ను అలా చూడాలనుకుంటున్నారు.. ఏం చేయాలి: ఉర్ఫి జావెద్‌..

June 23, 2022 2:39 PM

Urfi Javed : హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ ద్వారా ఎంతో ఫేమస్ అయింది.. ఉర్ఫి జావెద్‌. అయితే బిగ్‌బాస్‌ షో కన్నా ఈమె తాను ధరించే దుస్తుల వల్లే ఎక్కువ ఫేమస్‌ అయింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు మోడ్రన్‌ స్టైల్‌ దుస్తులు ధరించి అలరిస్తుంటుంది. రోజుకొక డ్రెస్‌ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి. ఈమె ధరించే దుస్తులన్నీ అందాల ఆరబోతనే ప్రథమ ధ్యేయంగా ఉంటాయి. కనుక ఈమె ఎల్లప్పుడూ ట్రోల్స్‌కు, విమర్శలకు గురవుతుంటుంది.

అయితే ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా.. విమర్శించినా తాను అనుకున్న పని చేస్తానని.. తనకు నచ్చినట్లు తాను ఉంటానని.. ఇదివరకే ఉర్ఫి జావెద్‌ స్పష్టం చేసింది. కనుక ఎవరు ఏమన్నా.. ఎన్ని తిట్టినా.. ఈమె అసలు పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ఈమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది.

Urfi Javed interesting comments about her life style
Urfi Javed

ప్రేక్షకులు నన్ను దుస్తులు లేకుండా నగ్నంగా చూడాలని కోరుకుంటున్నారు. ఏం చేయాలి.. నేను నాకు ఇష్టం వచ్చిన దుస్తులను ధరించడం తప్పా.. నన్ను విమర్శించే వారు ఎంతో మంది ఉంటారు.. రోజూ నాపై ట్రోల్స్‌ వస్తూనే ఉంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. షారూఖ్‌ ఖాన్‌ కుమార్తె అయినా ఆమెను కూడా ట్రోల్‌ చేస్తున్నారు కదా.. ఇక నేనెంత.. అంటూ ఉర్ఫి జావెద్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. దీంతో ఆమె కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment