Unstoppable With NBK : బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో.. త‌ర్వాతి గెస్ట్‌లు వీరే..!

October 31, 2021 11:23 PM

Unstoppable With NBK : నంద‌మూరి బాల‌య్య ఒక వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఆహా కోసం అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో మోహ‌న్ బాబుతో క‌లిసి తెగ సంద‌డి చేశాడు. చివర‌లో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, విష్ణు పాల్గొన‌గా.. వారిని బాల‌కృష్ణ ప్ర‌శ్న‌ల‌డిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ముగిసింది. నవంబర్‌ 4న ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

Unstoppable With NBK these are the guests for next episodes

ఈ షో త‌ర్వాతి గెస్ట్‌లు ఎవ‌ర‌ని కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండ‌వ హోస్ట్‌గా రానా ద‌గ్గుబాటి వ‌స్తారని, ఇక మూడో ఎపిసోడ్‌ నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుందని, ఈ ఎపిసోడ్‌కు సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోందని స‌మాచారం. ఇక‌ నాలుగో షోను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై చిత్రీక‌రించ‌బోతున్నారట. ఐద‌వ ఎపిసోడ్‌ను నంద‌మూరి మ‌రో న‌ట వార‌సుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తార‌ట‌.

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు. తొలి ఎపిసోడ్ ప్రోమో చూస్తే మాత్రం ఆయ‌న అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా చిత్రీక‌రించాడ‌ని తెలుస్తోంది. ఇక బాల‌కృష్ణ సినిమాల విష‌యాన‌కి వ‌స్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. దీని తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment