Unstoppable Show : బుల్లితెర స్టార్ యాంకర్లకు దీటుగా నందమూరి బాలకృష్ణ తన అన్‌స్టాపబుల్ షోను కొనసాగించారు. గతంలో కొందరు సినిమా స్టార్స్ పలు షోలను చేశారు. కానీ ఏ షోకూ రాని పేరు అన్‌స్టాపబుల్ షోకు వచ్చింది. రేటింగ్స్ పరంగా కూడా ఈ షో ఇరగదీసిందనే చెప్పాలి. బాలకృష్ణ ఈ షోలో తనలో ఉన్న సరదా యాంగిల్‌ను బయటకు తీశారు. ఎంతో మంది స్టార్స్‌తో సరదాగా షో నిర్వహించారు. ఇక ఈ షో ముగింపునకు వచ్చేసింది. అందులో భాగంగానే టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలకృష్ణ చివరి ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్ శుక్రవారం (ఫిబ్రవరి 4) ప్రసారం కానుంది. రాత్రి 8 గంటలకు ఆ ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేయనున్నారు.
కాగా మహేష్ బాబుతో బాలకృష్ణ చేసిన అన్‌స్టాపబుల్ షో మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత వారం కిందట ఓ ప్రోమోను ఆహా వారు లాంచ్ చేశారు. ఇక తాజాగా గురువారం మళ్లీ ఇంకో ప్రోమోను లాంచ్ చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో భాగంగా ఎపిసోడ్‌లోని పలు సీన్స్‌ను చూపించారు. వాటిల్లో మహేష్ బాబు ఎంతో సరదాగా నవ్వుతూ కనిపించారు.
ఎపిసోడ్‌లో భాగంగా బాలకృష్ణ.. మహేష్‌ను పలు ప్రశ్నలు అడిగారు. నువ్వు ఇంత యంగ్‌గా ఉన్నావేంటి..? అని మహేష్‌ను అడగ్గా.. అందుకు ఆయన బిగ్గరగా నవ్వేశారు. ఇక నా సినిమాలలోని ఏదైనా ఒక డైలాగ్‌ను నువ్వు చెబితే వినాలని ఉంది ? అని బాలయ్య.. మహేష్‌ను అడగ్గా.. అందుకు మహేష్ స్పందిస్తూ.. మీ సినిమాల్లోని డైలాగ్స్ ను మీరే చెప్పగలరు, ఇంకెవరితోనూ అది సాధ్యం కాదని అన్నారు.
చిన్నతనంలో నువ్వు చాలా నాటీ అని విన్నాను, నిజమేనా.. అని అడగ్గా.. అందుకు మహేష్ నవ్వేశారు. వెకేషన్ కని వెళ్లావు, పెళ్లి చేసుకున్నావు, ఏంటి కథ.. అని అడగ్గా.. అందుకు కూడా మహేష్ నవ్వారు. ఇక 3 ఏళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. అన్న ప్రశ్నకు మహేష్ స్పందిస్తూ.. తనను తాను కరెక్ట్ చేసుకునేందుకే అలా గ్యాప్ తీసుకున్నానని, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదని.. మహేష్ అన్నారు. ఇందుకు బాలయ్య.. అన్‌స్టాపబుల్ అన్నమాట.. అని రిప్లై ఇచ్చారు.
ఇలా బాలకృష్ణ, మహేష్‌ల అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎంతో సరదాగా, ఫన్నీగా సాగింది. ఇక ఈ షో శుక్రవారం రాత్రి 8 గంటలకు స్ట్రీమ్ కానున్న నేపథ్యంలో అందులో మహేష్‌ను బాలయ్య ఇంకా ఎన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారోనని ఉత్కంఠ కలుగుతోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్‌కు చెందిన ప్రోమో.. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…